CABLE CAR FALLS ON MOUNTAIN : కేబుల్ కార్ కూలి 13మంది మృతి

ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఈశాన్య ఇటలీలోని వర్బానియా సిటీకి దగ్గరలోని పర్వతంపై కేబుల్ కార్ కూలింది.

CABLE CAR FALLS ON MOUNTAIN : కేబుల్ కార్ కూలి 13మంది మృతి

Cable Car Falls On Mountain

Updated On : May 23, 2021 / 9:55 PM IST

CABLE CAR FALLS ON MOUNTAIN ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఈశాన్య ఇటలీలోని వర్బానియా సిటీకి దగ్గరలోని పర్వతంపై కేబుల్ కార్ కూలింది. ప్రమాదం సమయంలో కేబుల్ కారులో మొత్తం 15మంది ఉన్నారు. 13మంది ప్రాణాలు కోల్పోగా… తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలను హెలికాఫ్టర్ లో టురిన్ హాస్పిటల్ కి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. స్ట్రెసా- మోటరోన్ లైన్ లో ఈ ప్రమాదం జరిగింది.

ఆల్ప్స్​ పర్వత ప్రాంతాల్లో మోటరోన్ శిఖరంపైకి.. సముద్ర మట్టానికి 1,491 మీటర్లు ఎత్తుకు చేరుకునే ఈ కేబుల్ కార్ పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. అక్కడ ఆల్పైలాండ్ అనే చిన్న ఉద్యానవనం నుంచి 360 డిగ్రీల ప్రకృతి వీక్షణను ఆస్వాదించేందుకు వేసవిలో పర్యటకులు క్యూ కడుతుంటారు. ఇటలీలోని పర్వత ప్రాంతాల్లో ఈ తరహా పర్యటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. 2016లో పునరుద్ధరించిన ఈ కేబుల్ కార్ పర్యటక ప్రాంతం కరోనా వైరస్ కారణగా మూతపడింది. అయితే, లాక్​డౌన్ అనంతరం ఇటీవల తెరుచుకుంది.