చైనాది అబద్ధం… గాల్వాన్ లోయ కనిపెట్టింది మా తాతే

  • Publish Date - June 20, 2020 / 11:39 AM IST

లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ గురించి చైనా చెప్తున్న విషయాలన్నీ అబద్ధాలని మొహమ్మద్ అమీన్ గల్వాన్ అంటున్నాడు. అతని ముత్తాత గులామ్ రసూల్ గల్వాన్ 1890ల్లో ఈ లోయ గురించి కనిపెట్టాడని అంటున్నాడు. గల్వాన్ లోయతో అతనికి ఉన్న సంబంధం దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందనే దాని గురించి ఇలా చెప్పుకొచ్చాడు. బ్రిటిష్ అధికారులు ఆ ప్రాంతంలో తప్పిపోవడంతో గులామ్ రసూల్ గల్వాన్ కనిపెట్టి చూపించాడు. 

అప్పటి నుంచి దానికి గల్వాన్ లోయ అనే పేరు వచ్చింది. 1892-93లలో మా ముత్తాత బ్రిటిష్ వారికి ట్రెక్కింగ్ లో సహాయం చేసి ఈ లోయను కనిపెట్టాడు. గల్వాన్ నాలా నుంచి వారికి కొత్త దారిని చూపించి గమ్యానికి చేర్చాడు. ఆ తర్వాత ఆయన పేరును లోయకు పెట్టారు. సర్ యాంగ్ భర్త సాహస యాత్రలోనూ గులామ్ రసూల్ గల్వాన్ భాగమైయ్యాడు. 

ఇదెప్పటి నుంచో భారత భూభాగానికి చెందినదే. ఇండియన్ సైనికులు చైనీయులను వెనక్కు పంపేయాలి. ఇది చైనా భూభాగానికి చెందినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. లోయకు అతని పేరు పెట్టిన తర్వాత మా ముత్తాత అక్కడికి చాలా సార్లు వెళ్లాడు. లడఖ్ లో ఎప్పుడూ చైనాతో బోర్డర్ పంచుకోలేదు. టిబెట్ తో పంచుకున్నాం

బ్రిటిష్ అధికారులు ఉన్న కాలంలోని అఫీషియల్ గెజెట్స్ చూస్తే గాల్వాన్ లోయ ఇండియాలో భాగం అని తెలుస్తుంది. లడఖ్ లోని స్థానిక రెవెన్యూ లెక్కలు చూసినా గాల్వాన్ లోయ ఇండియాలో అంతర్భాగమని తెలుస్తుందని గులామ్ నబీ గల్వాన్ వెల్లడించాడు. 

Read: TikTokతో పాటు ఇతర China appలకు చెక్ పెడుతున్న ఇండియన్ ఇంటిలిజెన్స్ వర్గాలు