Aung San Suu Kyi : అవినీతి కేసులో..అంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు

అవినీతి కేసులో దోషిగా తేల్చిన మయన్మార్ కోర్టు హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత అంగ్ సాన్ సూకీకి అక్కడి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

Aung San Suu Kyi to 5 years in jail for corruption : అవినీతి కేసులో దోషిగా తేల్చిన జుంటా కోర్టు మయన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత అంగ్ సాన్ సూకీకి అక్కడి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సూకీపై మరో 10 కేసులు విచారణలో ఉన్నాయి. వాటికి సంబంధించి అభియోగాలు నిరూపణ అయితే మరో 15 ఏళ్లు శిక్ష పడే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. అవినీతి కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు 6 లక్షల డాలర్లను నగదు, బంగారాన్ని లంచం రూపంలో తీసుకున్నట్టు జుంటా కోర్టు స్పష్టం చేసింది. అనంతరం సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లోని న్యాయస్థానం పదవీచ్యుత నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించింది ధర్మాసనం.అనంతరం 76 ఏళ్ల సూకీకి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది.

Also read :  Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకు నాలుగేళ్ల జైలు శిక్ష

కాగా..అంగ్ సాన్ సూకీపై మయన్మార్ సైనిక ప్రభుత్వం మొత్తం 11 అవినీతి కేసులను మోపింది. వీటిలో అభియోగాలు నిరూపితం అయితే ఒక్కో దానిలో గరిష్ఠంగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 11 కేసుల్లో విచారణ పూర్తయిన మొదటి అవినీతి కేసు ఇది. నాలుగు గోడల మధ్యే కేసు విచారణ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇంతకుమించి వివరాలు బయటకు రాకుండా అక్కడి సైనిక సర్కారు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ చైర్ పర్సన్ గా ఉన్న అంగ్ సాన్ సూకీ ప్రజానేత. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఆమె మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. దీంతో ఆమెను మొదటి నుంచి సైనిక పాలకులు తొక్కిపెడుతూ వచ్చారు. 1990 ఎన్నికల్లో ఆమె పార్టీకి 81 శాతం పార్లమెంటు సీట్లు వచ్చాయి. అయినా ఆమెకు అధికారాన్ని బదలాయించేందుకు సైనిక పాలకులు నిరాకరించారు. ఎన్నికల ముందు నుంచే ఆమెను నిర్బంధించగా.. 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్లపాటు హౌస్ అరెస్ట్ లోనే ఉండిపోయారు.

Also read : Myanmar Military attack:మయన్మార్ లో మారణహోమం..చేతులు కట్టేసి..11మందిని సజీవ దహనం చేసిన మిలటరీ బలగాలు

ఆంగ్ సాన్ సూకీ గురించి ..

ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ లో జన్మించారు.  బర్మాదేశ ప్రతిపక్షనాయకురాలు. ప్రముఖ రాజకీయవాది, “నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ ” (ఎన్ ఎల్ డి) చైర్ పర్సన్. 1990 జనరల్ ఎన్నికలలో ఎన్ ఎల్ డి 59% ఓట్లను, 81% (మొత్తం 485 స్థానాలలో 382 స్థానాలు) పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నారు. అయినప్పటికీ ఆమెను ఎన్నికలకు ముందే బర్మా ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఆమె 1987 నుండి 2010లో విడుదల అయ్యేవరకూ దాదాపు 15 సంవత్సరాలకాలం గృహనిర్బంధంలోనే ఉంచబడింది. ఆమె ప్రంపచంలోనే ప్రముఖ రాజకీయఖైదీగా గుర్తించబడింది.

సూకీ 1990లో స్వతంత్ర భావాల కొరకు రాఫ్టో, షాఖ్రోవ్ పురస్కారం అందుకున్నది. 1991లో  నోబుల్ బహుమంతి అందుకున్నారామె. భారత ప్రభుత్వం అంతర్జాతీయ అవగాహన కొరకు ఆమెకు  జవహర్ లాల్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. వెనిజులా ప్రభుత్వం ఆమెకు ‘సైమన్ బోలీవర్’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. 2007 లోకెనాడా ప్రభుత్వం ఆమెకు గౌరవ పౌరసత్వం ఇచ్చి గౌరవించింది. కెనడా నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ఆమె నాలుగ వ్యక్తి కావటం గమనించాల్సిన విషయం. 2011లో ఆమె వాలెన్ బర్గ్ పతకం అందుకున్నది. 2012 సెప్టెంబరు 19 తేదీన ఆంగ్ కై సూకీ కాంగ్రెస్ బంగరు పతకం అధ్యక్షుని స్వాతంత్ర్య పతకంతో చేర్చి అందుకున్నది. ఇది సంయుక్తరాష్ట్రాల పురస్కారాలలో అత్యుత్తమమైనది.

 

 

ట్రెండింగ్ వార్తలు