Naim Qassem : హసన్ నస్రల్లా స్థానంలో హిజ్బుల్లా కొత్త చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్ ఎన్నిక
Naim Qassem : లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ డిప్యూటీ సెక్రటరీ జనరల్, సెకండ్-ఇన్-కమాండ్ నయీమ్ ఖాస్సేమ్‌ను హిజ్బుల్లా ఎన్నుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది.

Naim Qassem
Naim Qassem : లెబనాన్ మిలిటెంట్ గ్రూపు హిజ్బుల్లా కొత్త చీఫ్ ఎన్నికయ్యారు. హసన్ నస్రల్లా స్థానంలో కొత్త హిజ్బుల్లా చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్ను నియమించారు. గత సెప్టెంబరు 27న బీరుట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మాజీ చీఫ్ హసన్ నస్రల్లా హతమైన సంగతి తెలిసిందే. ఇరాన్ మద్దతుగల లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ డిప్యూటీ సెక్రటరీ జనరల్, సెకండ్-ఇన్-కమాండ్ నయీమ్ ఖాస్సేమ్‌ను హిజ్బుల్లా ఎన్నుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. దాదాపు నెల రోజుల తర్వాత హిజ్బుల్లా తమ కొత్త చీఫ్‌ను ప్రకటించింది. దీని ప్రకారం.. మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా షురా కౌన్సిల్ 71 ఏళ్ల ఖాస్సేమ్‌ను ఎన్నుకుంది.
1991లో డిప్యూటి సెక్రటరీ జనరల్‌గా నియమితులైన ఖాసేమ్.. నస్రల్లా హత్య తర్వాత బీరూట్, రెండు టెహ్రాన్ నుంచి మిలిటెంట్ గ్రూప్ యాక్టింగ్ లీడర్‌గా పనిచేశారు. అనేక సందర్భాల్లో ఖాస్సేమ్ మాట్లాడుతూ.. లెబనాన్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్-హిజ్బుల్లా వివాదంలో కాల్పుల విరమణ కుదుర్చుకునే ప్రయత్నాలకు మిలిటెంట్ గ్రూప్ మద్దతు ఇచ్చిందని చెప్పారు.
ఈ నెల ప్రారంభంలో బీరూట్‌లో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో నస్రల్లా బంధువు, ఆయన వారసుడుగా మారాలని సూచించిన మతగురువు హషేమ్ సఫీద్దీన్ కూడా హత్యకు గురవుతారనే భయంతో ఖాస్సేమ్ ఇరాన్‌కు పారిపోయి ఉండవచ్చునని వార్తలు వచ్చాయి. అక్టోబర్ 21 నాటి నివేదిక ప్రకారం.. యూఎఈకి చెందిన ఎరెమ్ న్యూస్ వెబ్‌సైట్, లెబనాన్, సిరియా దేశాల పర్యటనకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘి వాడిన విమానంలో ఖాస్సేమ్ అక్టోబర్ 5న బీరుట్ నుంచి బయలుదేరినట్లు తెలిపింది.
నయీమ్ ఖాస్సేమ్ ఎవరంటే? :
దక్షిణ లెబనాన్‌లోని క్ఫర్‌ఫిలా నగరంలో నయీమ్ ఖాస్సేమ్ జన్మించాడు. చాలా ఏళ్లు టీచర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. లెబనీస్ యూనివర్శిటీలో కెమెస్ట్రీ సబ్జెక్టును అభ్యసించారు. 1991లో గ్రూప్ అప్పటి సెక్రటరీ జనరల్ అబ్బాస్ అల్-ముసావిచే డిప్యూటీ చీఫ్‌గా నియమించినప్పటినుంచి 30 సంవత్సరాలకు పైగా నయీమ్ ఖాస్సేం హిజ్బుల్లా అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తన రాజకీయ జీవితం లెబనీస్ షియా అమల్ ఉద్యమంతో ప్రారంభమైంది. ఇరాన్ ఇస్లామిక్ విప్లవం నేపథ్యంలో 1979లో తన గ్రూపును విడిచిపెట్టాడు.
1982లో ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడి చేసిన తర్వాత ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మద్దతుతో స్థాపించిన హిజ్బుల్లా ఏర్పాటు సమావేశాలలో పాల్గొన్నాడని రాయిటర్స్ నివేదించింది. 1992లో మిలిటెంట్ గ్రూప్ మొదటిసారి పోటీ చేసినప్పటి నుంచి హిజ్బుల్లా పార్లమెంటరీ ఎన్నికల ప్రచారానికి జనరల్ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. నస్రల్లా నాయకుడిగా ఖాస్సేమ్ తన నాయకత్వాన్ని కొనసాగించాడు. గత ఏడాది కాలంలో ఇజ్రాయెల్‌తో సరిహద్దు శత్రుత్వం చెలరేగడంతో సహా విదేశీ మీడియాతో సమావేశాలను నిర్వహించడం ద్వారా హిజ్బుల్లా ప్రముఖ ప్రతినిధిలలో ఒకరిగా నిలిచారు.
Read Also : Israel: బాబోయ్.. హెజ్‌బొల్లా సొరంగం చూశారా.. లోపల చిన్నపాటి ఇంటినే నిర్మించారు.. వీడియో వైరల్