Israel: బాబోయ్.. హెజ్‌బొల్లా సొరంగం చూశారా.. లోపల చిన్నపాటి ఇంటినే నిర్మించారు.. వీడియో వైరల్

ఈ వీడియోలో ఐడీఎఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవీ మాట్లాడుతూ.. మా దేశం సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న హెజ్ బొల్లా సొరంగాన్ని

Israel: బాబోయ్.. హెజ్‌బొల్లా సొరంగం చూశారా.. లోపల చిన్నపాటి ఇంటినే నిర్మించారు.. వీడియో వైరల్

Hezbollah's Advance Tunnel

Updated On : October 29, 2024 / 1:43 PM IST

Hezbollah Tunnel Video viral: ఇజ్రాయెల్ దళాలు హెజ్‌బొల్లా స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఆ దేశం సరిహద్దుల్లో హెజ్ బొల్లా సొరంగాన్ని కనుగొంది. ఈ సొరంగం చిన్నపాటి ఇంటి వలే ఉంది. ఈ సొరంగంలో అనేక సౌకర్యాలు ఉన్నాయి. కిచెన్ తోపాటు ఆయుధాలను భద్రపర్చుకునేందుకు రూంలతో పాటు బాత్ రూమ్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) అధికారిక ట్విటర్ ఖాతాలో విడుదల చేసింది. ఈ వీడియోలో హెజ్ బెల్లా సొరంగంలో ఉన్న సౌకర్యాలను ఇజ్రాయెల్ ఆర్మీ చూపించింది. గాజాలోని హమాస్ సొరంగాల కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి.

Also Read: Jammu Kashmir Encounter: ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయి ఆర్మీ డాగ్ ‘ఫాంటమ్’

ఈ వీడియోలో ఐడీఎఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవీ మాట్లాడుతూ.. మా దేశం సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న హెజ్ బొల్లా సొరంగాన్ని గుర్తించాం. ఈ సొరంగం అధునాతన సౌకర్యాలతో ఉంది. ఇక్కడ వస్తువుల నిల్వ, కిచెన్, అనేక ఆయుధాలను నిల్వ చేసుకునేందుకు సౌకర్యాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ పై దండయాత్ర చేసేందుకు మిలిటెంట్లు ఇక్కడే ఉండి సన్నద్ధమయ్యారు. ఈ విషయాన్ని మేము ముందే చెప్పినా పలు దేశాలు మా వ్యాఖ్యలను కొట్టిపారేశాయి. ప్రస్తుతం వీటిని చూస్తుంటే మేము చెప్పింది నిజమేనని స్పష్టమైంది. భారీ నష్టం జరగకముందే ఈ సొరంగాన్ని మేము గుర్తించామని హలేవీ పేర్కొన్నారు.