LunaRecycle Challenge : నాసా బంపర్ ఆఫర్.. చంద్రుడిపై మానవ వ్యర్థాలను తొలగించే ఐడియా చెప్పండి.. రూ. 25 కోట్ల ప్రైజ్ మనీ.. మీ సొంతం!

LunaRecycle Challenge : అపోలో మిషన్ల సమయంలో చంద్రునిపై మిగిలిపోయిన 96 బస్తాల మానవ వ్యర్థాలను రీసైకిల్ చేసేందుకు అద్భుతమైన ఐడియా ఇచ్చినవారికి 3 మిలియన్ డాలర్ల బహుమతిని అందించనుంది.

LunaRecycle Challenge

LunaRecycle Challenge : అంతరిక్షంలో అతిపెద్ద సవాలు.. చంద్రుడిపై ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన మానవ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం. ఇప్పుటివరకు ఎంతోమంది వ్యోమగాములు చంద్రునిపైకి పంపింది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. అయితే, వ్యోమగాములకు సంబంధించిన మానవ వ్యర్థాలు అక్కడే అలానే ఉండిపోయాయి.

ఇప్పుడు ఆ వ్యర్థాలతో పెద్ద చెత్తకుప్పలా మారింది. ఈ మానవ వ్యర్థాలను ఎలాగైనా రీసైక్లింగ్ చేయాలని నాసా భావిస్తోంది. ఇందుకోసం అమెరికా ప్రభుత్వ అంతరిక్ష సంస్థ ‘నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్’ (NASA) ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Read Also : iPhone 17 Pro Max : పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ వస్తోందోచ్.. ధర, డిజైన్ వివరాలు లీక్.. ఫుల్ డిటెయిల్స్

అంతరిక్షంలో మానవ మలం, మూత్రం వంటి వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే పద్ధతిని చెప్పేందుకు లూనా రీసైకిల్ ఛాలెంజ్ పేరిట ఒక పోటీని నిర్వహిస్తోంది. ఈ ‘పజిల్’ని ఎవరు పరిష్కరిస్తారో వారికి పూర్తిగా 3 మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించనుంది. అంటే.. దాదాపు రూ.25.81 కోట్లు అనమాట. అంతరిక్షంలో మానవ ఉనికిని స్థిరంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా నాసా ఈ దిశగా వినూత్నంగా పరిష్కారాన్ని వెతుకుతోంది.

చంద్రునిపై 96 బ్యాగుల్లో మానవ వ్యర్థాలు :
నివేదికల ప్రకారం.. అపోలో మిషన్ సమయంలో వదిలేసిన మానవ వ్యర్థాలు ఇప్పటికీ చంద్రునిపై పడి ఉన్నాయి. ఇప్పుడు నాసా భవిష్యత్ మిషన్లలో ఈ కాలుష్యం మరింత పెరగకూడదని భావిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వ్యోమగాముల వ్యర్థాలను రీసైకిల్ చేయగల మంచి ఐడియా చెప్పమని అడుగుతోంది.

1969 నుంచి 1972 మధ్యకాలంలో నాసా పరిశోధనల కోసం ప్రత్యేకించి ఆపోలో మిషన్‌‌లో భాగంగా అనేక మంది వ్యోమగాములను చంద్రుడిపైకి పంపింది. అయితే, లూనారీ మాడ్యూల్‌లో స్టోర్ చేసే స్థల పరిమితి దృష్ట్యా అక్కడి వ్యోమగాములు అవసరంలేని వస్తువులను అంతరిక్షంలో బయటకు విసిరేసి వచ్చినట్టు నాసా చెబుతోంది.

ఇందులో మానవ వ్యర్థాలే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అవన్నీ చిన్న బ్యాగుల్లో చంద్రునిపై పడి ఉన్నాయని నాసా తెలిపింది. ఇలాంటి మాన వ్యర్థాలకు సంబంధించి మొత్తం 96 బ్యాగులు ఉన్నాయని అంటోంది. అక్కడ పేరుకుపోయిన ఈ చెత్తను క్లియర్ చేయాలని నాసా భావిస్తోంది.

ఇందులో భాగంగానే రీసైకిలింగ్ ఛాలెంజ్ కోసం ఆఫర్ ప్రకటించింది. ఈ మానవ వ్యర్థాలను ఎలాగైనా క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలను ఏదైనా కొత్త ఐడియా చెప్పమని కోరుతోంది. ఎవరైతే అద్భుతమైన ఐడియా చెబుతారో వారికి ఏకంగా రూ. 25 కోట్లు నజరానా ఇస్తామని ప్రకటించింది.

మంచి ఐడియా ఇస్తే రూ. 25కోట్లు నజరానా :
ఈ సవాలు కేవలం అక్కడ వ్యర్థాలను క్లీన్ చేయడం మాత్రమే కాదు.. భూమిపై రీసైక్లింగ్ కొత్త మార్గాలకు కూడా దారితీస్తుందని నాసా భావిస్తోంది. పూర్తిగా కొత్త సాంకేతికతతో విష వ్యర్థాలను తగ్గించే ప్రక్రియ కావచ్చు.

Read Also : VIVO 5G Smartphones : వివో లవర్స్‌కు కోసం రూ.15వేల లోపు ధరలో బెస్ట్ 5G ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

ప్రస్తుతం నాసా మొదటి రౌండ్ ఎంట్రీలను పరిశీలిస్తోంది. మొదటి దశలో ప్రవేశానికి చివరి తేదీ మార్చి 31, 2025గా నిర్ణయించింది. ఇప్పుడు నాసా త్వరలో మంచి ఐడియా ఇచ్చినవారిని ఎంపిక చేస్తుంది. ఆపై పోటీలో గెలిచిన విజేతలకు 3 మిలియన్ డాలర్ల బహుమతి అందిస్తుంది.