VIVO 5G Smartphones : వివో లవర్స్‌కు కోసం రూ.15వేల లోపు ధరలో బెస్ట్ 5G ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

VIVO 5G Smartphones : అద్భుతమైన ఫీచర్లు కలిగిన వివో 5జీ స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం రూ. 15వేల లోపు ధరలో లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఏదో ఎంచుకుని కొనేసుకోవచ్చు.

VIVO 5G Smartphones : వివో లవర్స్‌కు కోసం రూ.15వేల లోపు ధరలో బెస్ట్ 5G ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

VIVO 5G Smartphones

Updated On : April 12, 2025 / 4:09 PM IST

VIVO 5G Smartphones : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం 2025 మార్కెట్లో ఈ ఏప్రిల్‌లో అద్భుతమైన 5G వివో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. చాలామంది వివో యూజర్లకు ఏ ఫోన్ కొనాలో పెద్దగా అవగాహన ఉండదు. ఏదో ఒక ఫోన్ అంటూ కొనేస్తుంటారు. ఫీచర్ల కోసం కొందరు అయితే.. ధర తక్కువ ఉంటే చాలు అని భావిస్తుంటారు.

ఫీచర్లతో పాటు ధర కూడా మీ బడ్జెట్ ధరలో కొన్ని వివో 5జీ స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. వివో T3x 5G, వివో T3 లైట్ 5G, వివో Y36, వివో Y28e 5G, వివో Y28s 5G ఫోన్లు సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ ఏప్రిల్ 2025 నాటికి రూ. 15వేల లోపు ధరలో మార్కెట్లో లభించే వివో మోడళ్లలో కొన్ని 5జీ ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన వివో ఫోన్ కొనేసుకోండి.

Read Also : iPhone 17 Pro Max : పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ వస్తోందోచ్.. ధర, డిజైన్ వివరాలు లీక్.. ఫుల్ డిటెయిల్స్

వివో T3x 5G : 

  • ధర: రూ. 12,999
  • ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1
  • ర్యామ్ : 4GB/ 6GB
  • స్టోరేజీ : 128GB (1TB వరకు)
  • డిస్‌ప్లే : 6.72-అంగుళాల ఫుల్ HD+ (1080 x 2408 పిక్సెల్స్) IPS LCD, 120Hz రిఫ్రెష్ రేట్
  • బ్యాక్ కెమెరా : 50MP+2MP డ్యూయల్ సెటప్
  • ఫ్రంట్ కెమెరా : 8MP
  • బ్యాటరీ : 6000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

వివో T3 లైట్ 5G :

  • ధర: రూ. 10,499
  • ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300
  • ర్యామ్ : 4GB/6GB
  • స్టోరేజీ : 128GB (1TB వరకు)
  • డిస్‌ప్లే : 6.56-అంగుళాల HD+ (720 x 1612 పిక్సెల్స్) IPS LCD, 90 Hz రిఫ్రెష్ రేట్
  • బ్యాక్ కెమెరా : 50MP + 2 MP డ్యూయల్ సెటప్
  • ఫ్రంట్ కెమెరా: 8MP
  • బ్యాటరీ : 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

వివో Y36 :

  • ధర : రూ. 14,999
  • ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680
  • ర్యామ్ : 8GB
  • స్టోరేజీ : 128GB
  • డిస్‌ప్లే : 6.64-అంగుళాల ఫుల్ HD+ (1080 x 2408 పిక్సెల్స్) IPS LCD, 90 Hz రిఫ్రెష్ రేట్
  • బ్యాక్ కెమెరా : 50MP + 2MP డ్యూయల్ సెటప్
  • ఫ్రంట్ కెమెరా : 16MP
  • బ్యాటరీ : 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

వివో Y28e 5G :

  • ధర: రూ. 9,999
  • ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300
  • ర్యామ్ : 4GB
  • స్టోరేజీ : 64GB (1TB వరకు)
  • డిస్‌ప్లే : 6.56-అంగుళాల HD+ (720×1612 పిక్సెల్స్) IPS LCD, 90 Hz రిఫ్రెష్ రేట్
  • రియర్ కెమెరా: 13MP+0.08MP డ్యూయల్ సెటప్
  • ఫ్రంట్ కెమెరా : 5MP
  • బ్యాటరీ : 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

వివో Y28s 5G :

Read Also : UPI QR Payments : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం యూజర్లకు అలర్ట్.. ఇకపై షేరింగ్ QR కోడ్‌తో ఇంటర్నేషనల్ యూపీఐ పేమెంట్స్ చేయలేరు..!

  • ధర : రూ. 13,499
  • ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300
  • ర్యామ్ : 6GB
  • స్టోరేజీ : 128GB (1 TB వరకు)
  • డిస్‌ప్లే : 6.56-అంగుళాల HD+ (720 x 1612 పిక్సెల్స్) IPS LCD, 90 Hz రిఫ్రెష్ రేట్
  • బ్యాక్ కెమెరా: 50MP + 0.08MP డ్యూయల్ సెటప్
  • ఫ్రంట్ కెమెరా: 8MP
  • బ్యాటరీ: 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

ఈ వివో మోడల్‌లు మీ బడ్జెట్‌ ధరలో 5G కనెక్టివిటీని అందించే అనేక ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత వివో 5జీ ఫోన్ల ధరలతో పాటు కొనగోలు కోసం అధికారిక Vivo రిటైలర్‌ లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి. లేదంటే ఈ-కామర్స్ వెబ్ సైట్లలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చెక్ చేసి ఆ తర్వాతే కొనుగోలు చేయండి.