iPhone 17 Pro Max : పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ వస్తోందోచ్.. ధర, డిజైన్ వివరాలు లీక్.. ఫుల్ డిటెయిల్స్
iPhone 17 Pro Max : అతి త్వరలో కొత్త ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లాంచ్ కానుంది. అంతకన్నా ముందే ఈ ప్రో మ్యాక్స్ ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. లాంచ్ తేదీ కూడా ముందుగానే లీక్ అయింది..

iPhone 17 Pro Max
iPhone 17 Pro Max : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది. ఈ కొత్త ఐఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ సంవత్సరంలో అత్యంత చర్చనీయాంశమైన లాంచ్‌లలో ఇదొకటి మారింది. ఐఫోన్ 17 లైనప్‌లో ఈ సెప్టెంబర్‌లో వచ్చే అవకాశం ఉంది.
ఆపిల్ ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్ ప్రధాన డిజైన్ మార్పులు, పవర్‌ఫుల్ కెమెరాలు, స్పీడ్ పర్ఫార్మెన్స్‌తో రావచ్చు. లీక్‌ల ప్రకారం.. కొత్త కెమెరా లేఅవుట్ నుంచి ధర పెరుగుదల వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ తేదీ (అంచనా) :
ఈ ఏడాదిలో సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 13 మధ్య జరగబోయే వార్షిక ఈవెంట్‌లో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ అన్నీ ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర (అంచనా) :
ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు, అధిక దిగుమతి సుంకాలు కొత్త ఐఫోన్ల ధరలపై భారీ ప్రభావం చూపవచ్చు. ఐఫోన్ 17 ప్రో మాక్స్ భారత మార్కెట్లో దాదాపు రూ.1,64,999 ఖర్చవుతుందని లీక్‌లు సూచిస్తున్నాయి. అమెరికాలో కొన్ని టాప్-ఎండ్ మోడల్స్ స్టోరేజీని బట్టి 2,300 డాలర్ల వరకు చేరుకోవచ్చు.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిజైన్ :
టైటానియం ఫ్రేమ్ నుంచి తేలికైన అల్యూమినియం, గ్లాస్ బాడీకి మారనుంది. ఐఫోన్ అందించే అతిపెద్ద మార్పులలో ఇదొకటి కావచ్చు. బ్యాక్ కెమెరా మాడ్యూల్ కూడా రీడిజైన్ చేయొచ్చు. రౌండెడ్ కార్నర్‌తో కూడిన రెక్టాంగ్యులర్ బార్ కావచ్చు.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ కలర్ ఆప్షన్స్(అంచనా) :
కలర్ ఆప్షన్ల విషయానికొస్తే.. బ్లాక్, వైట్, గ్రే కలర్ గోల్డ్ వంటి అప్‌డేట్ వెర్షన్లు కొత్త మార్కెటింగ్ పేర్లతో రావొచ్చు.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ కెమెరా అప్‌గ్రేడ్‌లు :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో బ్యాక్ సైడ్‌లో 3 48MP కెమెరాలతో వస్తుందని భావిస్తున్నారు. ఇందులో జూమ్ కోసం అప్‌గ్రేడ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది. ఫ్రంట్ కెమెరాను 24MP వరకు పెంచవచ్చు. క్లియర్ అండ్ క్వాలిటీ సెల్ఫీలను అందిస్తుంది.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్పెక్స్(అంచనా) :
ఆపిల్ ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్ సున్నితమైన స్క్రోలింగ్ కోసం 120Hz ప్రోమోషన్‌తో 6.9-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆపిల్ కొత్త A19 ప్రో చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB ర్యామ్, స్పీడ్ 35W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.