YouTube Music : యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. మీ వీడియోలకు మీరే మ్యూజిక్‌ క్రియేట్ చేయొచ్చు.. కాపీరైట్ ఇబ్బందే ఉండదు..!

YouTube Music : యూట్యూబ్ క్రియేటర్లకు అదిరిపోయే అప్‌డేట్.. వీడియోలకు మ్యూజిక్ విషయంలో డౌటే అక్కర్లేదు. ఈ ఏఐ మ్యూజిక్ జనరేషన్ టూల్ ద్వారా నచ్చిన మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు.

YouTube Music : యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. మీ వీడియోలకు మీరే మ్యూజిక్‌ క్రియేట్ చేయొచ్చు.. కాపీరైట్ ఇబ్బందే ఉండదు..!

AI-Powered Music Generation Feature

Updated On : April 12, 2025 / 1:56 PM IST

YouTube Music : యూట్యూబ్ క్రియేటర్లకు బిగ్ అప్‌డేట్.. ఇకపై యూట్యూబ్ వీడియోలకు మ్యూజిక్ యాడ్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి కాపీరైట్ స్ట్రయిక్ ఉంటుందనే ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే.. యూట్యూబ్ తమ క్రియేటర్ల కోసం ప్లాట్‌ఫామ్‌లో కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌ను తీసుకొస్తోంది.

అదే.. కొత్త AI-ఆధారిత మ్యూజిక్ జనరేటర్ టూల్. ఈ ఏఐ టూల్ సాయంతో కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోల కోసం కస్టమ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ యూట్యూబ్ స్టూడియోలోని క్రియేటర్ మ్యూజిక్ ట్యాబ్‌లో ఉంటుంది.

Read Also : Jio IPL Plans : ఐపీఎల్ ప్రియులకు పండగే.. జియో పాపులర్ ప్లాన్లు ఇవే.. 20GB ఎక్స్‌ట్రా హైస్పీడ్ డేటా.. క్రికెట్ లైవ్ మ్యాచ్ చూడొచ్చు..!

దీనికి పైసా ఖర్చు లేకుండా క్రియేటర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్‌ను క్రమంగా క్రియేటర్లందరికి అందుబాటులోకి తీసుకురానుంది. పూర్తిగా రిలీజ్ అయ్యేందుకు కొన్ని రోజులు సమయం పట్టవచ్చని వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం పేర్కొంది.

యూట్యూబ్ ఏఐ ఆధారిత మ్యూజిక్ జనరేషన్ టూల్ :
కంపెనీ క్రియేటర్ ఇన్‌సైడ్ ఛానెల్‌లోని యూట్యూబ్ వీడియోలో కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇకపై కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోలకు ఇన్స్ట్రుమెంటల్స్‌ మ్యూజిక్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఈ కొత్త ఏఐ టూల్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది.

కాపీరైట్ స్ట్రైక్ కారణంగా యూట్యూబ్ వీడియోకు మ్యూజిక్ యాడ్ చేయడం క్రియేటర్లకు ఇబ్బందిగా మారింది. కంటెంట్ క్రియేటర్లు లేబుల్స్, కమర్షియల్ స్టూడియోల నుంచి మ్యూజిక్ ప్లే చేయలేరు. ప్లాట్‌ఫామ్‌లో అదే సాంగ్స్ యాడ్ చేసినా కూడా కాపీరైట్ ఇష్యూ వస్తోంది.

అందుకే.. కంటెంట్ క్రియేటర్లు సాధారణ ఓపెన్-సోర్స్ ఇన్స్ట్రుమెంటల్స్‌తో లేదా క్రియేటర్ మ్యూజిక్ ట్యాబ్ ద్వారా యూట్యూబ్ లైబ్రరీని ఎంచుకోవచ్చు. ఇంటర్‌ఫేస్ క్రియేటర్లకు కాపీరైట్-ఫ్రీ మ్యూజిక్ బిగ్ కేటలాగ్ నుంచి ఎంచుకోవచ్చు.

ఈ ట్యాబ్ జనరిక్స్, మూడ్, వోకల్స్, బీట్స్ పర్ మినిట్ (BPM), డ్యురేషన్ మరిన్నింటి ద్వారా మ్యూజిక్ బ్రౌజ్ చేసేందుకు అనుమతిస్తుంది. ముఖ్యంగా, క్రియేటర్ మ్యూజిక్‌లోని అన్ని ట్రాక్‌లు ఫ్రీ కాదని గమనించాలి. క్రియేటర్లు కొన్ని ప్రీమియం ట్రాక్‌ల కోసం చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త ఏఐ టూల్ ద్వారా మ్యూజిక్ అసిస్టెంట్, క్రియేటర్లు తమ వీడియోలకు సరైన ట్రాక్‌ను ఎంచుకోవచ్చు. జెమిని స్పార్కిల్ ఐకాన్‌తో క్రియేటర్ మ్యూజిక్‌లో స్పెషల్ ట్యాబ్‌గా అందుబాటులో ఉంది. పేజీలో ఒక టెక్స్ట్ ఫీల్డ్ కూడా ఉంది. ఇక్కడ వినియోగదారులు వీడియో అంశం, మూడ్, డ్యురేషన్, ఇతర అంశాలను పేర్కొనడం ద్వారా వారు వెతుకుతున్న మ్యూజిక్ ట్రాక్‌ను వివరించవచ్చు. ప్రాంప్ట్ రాసిన తర్వాత వినియోగదారులు 4 ఆడియో మోడల్స్ కోసం క్రియేట్ బటన్‌ను ట్యాప్ చేయొచ్చు.

కంటెంట్ క్రియేటర్లకు ఏం జనరేట్ చేయాలో తెలియకపోతే, సజెస్ట్ ట్యాబ్‌పై ట్యాప్ చేయొచ్చు. అక్కడ ఏఐ కోసం కొన్ని ఐడియాస్ సూచిస్తుంది. ఈ ఫీచర్ క్రియేటర్లందరికి ఉచితంగా ఉపయోగించవచ్చని యూట్యూబ్ తెలిపింది. అయితే, ఈ టూల్ ఉపయోగించడానికి ఏవైనా రేట్ లిమిట్స్ ఉన్నాయో లేదో పేర్కొనలేదు.

Read Also : UPI Services Down : బిగ్ అలర్ట్.. మళ్లీ నిలిచిపోయిన యూపీఐ సేవలు.. పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త.. వేలాది మంది యూజర్ల ఫిర్యాదులు..!

ఈ ఏఐ మోడల్ ఫీచర్‌ గురించి యూట్యూబ్ వివరాలను రివీల్ చేయలేదు. ఈ టూల్ ఉపయోగించి రూపొందించిన ఆడియో కాపీరైట్ స్ట్రైక్‌లు పడవని పేర్కొంది. డివైజ్ అప్‌గ్రేడ్ కోసం కంపెనీ ప్రాంప్ట్‌లను కూడా సేకరిస్తుంది. డేటా సర్వర్‌లలో 30 రోజుల పాటు స్టోర్ చేస్తుంది.