Jio IPL Plans : ఐపీఎల్ ప్రియులకు పండగే.. జియో పాపులర్ ప్లాన్లు ఇవే.. 20GB ఎక్స్‌ట్రా హైస్పీడ్ డేటా.. క్రికెట్ లైవ్ మ్యాచ్ చూడొచ్చు..!
Jio IPL Plans : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ చూసేవారి కోసం జియో 20GB ఎక్స్‌ట్రా డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ రెండు పాపులర్ రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే చాలు..

Jio IPL Plans
Jio IPL Plans : ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ చూడాలంటే ఎక్కువ డేటా అవసరం. అందుకే రిలయన్స్ జియో 46 కోట్ల మంది వినియోగదారుల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. జియో తమ యూజర్ల కోసం అదనపు డేటాను కూడా అందిస్తోంది.
ప్రత్యేకించి ఐపీఎల్ యూజర్ల కోసం రెండు పాపులర్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. జియో 20GB బోనస్ డేటా ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్లతో వినియోగదారులు ఎక్కువ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఐపీఎల్ సీజన్‌లో జియో ప్లాన్లతో రీఛార్జ్ చేసుకువాలంటే ఇదే సరైన సమయం.
కంపెనీ అందించే ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై 20GB అదనపు హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఐపీఎల్ సీజన్ సమయంలో ఈ బోనస్ డేటాను క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేయొచ్చు. డేటా లిమిట్ విషయంలో ఆందోళన లేకుండా ట్రావెల్ సమయంలో కూడా హాయిగా ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.
రూ. 899 ప్లాన్ : ఫ్రీ డిస్నీ+ హాట్‌స్టార్‌తో 90 రోజుల వ్యాలిడిటీ :
రిలయన్స్ జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇప్పటికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్ 90 రోజులు వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 180GB రెగ్యులర్ డేటాను అందిస్తుంది. అంతేకాదు.. 20GB అదనంగా డేటా లభిస్తుంది.
90 రోజుల పాటు 200GB డేటా కూడా పొదవచ్చు. దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. యూజర్‌కు 90 రోజుల పాటు రోజుకు 100 ఉచిత SMSలు లభిస్తాయి. ఓటీటీ బెనిఫిట్స్ కోసం వినియోగదారులు 90 రోజుల పాటు ఫ్రీ డిస్నీ ప్లస్, హాట్‌స్టార్ సభ్యత్వాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్ లాంగ్ టైమ్ వ్యాలిడిటీ కోరుకునే వినియోగదారులకు సరైనది. ముఖ్యంగా డిస్నీ+ హాట్‌స్టార్ ద్వారా IPL స్ట్రీమింగ్ చూసేవారికి బెస్ట్ అని చెప్పవచ్చు.
రూ. 749 ప్లాన్ : 72 రోజుల వ్యాలిడిటీ + అదనపు డేటా :
బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్ కోరుకునే యూజర్ల కోసం జియో రూ. 749 ప్లాన్‌లో ఇప్పుడు 20GB బోనస్ డేటా కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ 72 రోజులు వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 144GB రెగ్యులర్ డేటాతో పాటు 20GB అదనపు డేటాతో వస్తుంది.
అంతేకాదు.. 72 రోజుల పాటు మొత్తం 164GB డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, OTT, Jio బెనిఫిట్స్ పొందవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్స్ కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్.
జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ ఫ్రీ యాక్సెస్ :
అదనపు డేటాతో పాటు రెండు ప్లాన్‌లు JioTV, JioCinema, Jio Cloud సర్వీసులకు ఫ్రీ యాక్సెస్‌ను కూడా అందిస్తాయి. మీరు లైవ్ క్రికెట్ చూస్తున్నా, షోలను అమితంగా చూస్తున్నా లేదా ముఖ్యమైన ఫైల్‌లను స్టోర్ చేస్తున్నా, ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.