UPI Services Down : బిగ్ అలర్ట్.. మళ్లీ నిలిచిపోయిన యూపీఐ సేవలు.. పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త.. వేలాది మంది యూజర్ల ఫిర్యాదులు..!

UPI Services Down : యూపీఐ యూజర్లకు అలర్ట్.. యూపీఐ సర్వీసులు స్తంభించాయి. దేశవ్యాప్తంగా వేలాదిమంది యూపీఐ యూజర్లు పేమెంట్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

UPI Services Down : బిగ్ అలర్ట్.. మళ్లీ నిలిచిపోయిన యూపీఐ సేవలు.. పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త.. వేలాది మంది యూజర్ల ఫిర్యాదులు..!

UPI down

Updated On : April 12, 2025 / 1:23 PM IST

UPI Services Down : మీ యూపీఐ పనిచేస్తుందా? ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు జర జాగ్రత్త. ఎందుకంటే.. ప్రస్తుతం యూపీఐ సర్వీసులు నిలిచిపోయాయి. వేలాది మంది యూపీఐ యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 12న (శనివారం) ఉదయం భారత్ అంతటా యూపీఐ సేవలలో సాంకేతిక సమస్య తలెత్తింది.

దాంతో యూపీఐ వినియోగదారుల డిజిటల్ లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ ఊహించని అంతరాయం యూపీఐపై తీవ్ర ప్రభావం చూపింది. యూపీఐ యూజర్లు, మర్చంట్స్ సర్వీసులు నిలిచిపోవడంతో పేమెంట్స్ ఫెయిల్ అయ్యాయి.

Read Also : Jio IPL Plans : ఐపీఎల్ ప్రియులకు పండగే.. జియో పాపులర్ ప్లాన్లు ఇవే.. 20GB ఎక్స్‌ట్రా హైస్పీడ్ డేటా.. క్రికెట్ లైవ్ మ్యాచ్ చూడొచ్చు..!

(DownDetector) నివేదికల ప్రకారం.. మధ్యాహ్నం నాటికి ఈ యూపీఐ సమస్యలపై దాదాపు 1,168 ఫిర్యాదులు వచ్చాయి. అందులో గూగుల్ పే యూజర్లు 96 సమస్యలను నివేదించగా, పేటీఎం యూజర్లు 23 సమస్యలను గుర్తించారు. యూపీఐ ఇటీవలి సమస్యను ఇంకా పరిష్కరించలేదు. కానీ, గత కొన్ని రోజులుగా ఇప్పటికే అనేకసార్లు యూపీఐ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

గత మార్చి 26న యూపీఐ సర్వీసులకు మొదటగా అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో వివిధ UPI యాప్‌ల వినియోగదారులు దాదాపు 2 గంట నుంచి 3 గంటల పాటు యూపీఐ సర్వీసులను యాక్సెస్ చేయలేకపోయారు.

AP Inter Results 2025

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ సమస్యకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు కారణమని తెలిపింది. రోజువారీ వినియోగదారులు, వ్యాపారులు తీవ్ర అంతరాయాలను ఎదుర్కొన్నారు. ప్రత్యేకించి రెగ్యులర్ యూపీఐ లావాదేవీలకు అంతరాయం కలిగింది.

ప్రస్తుత రోజుల్లో రోజువారీ లావాదేవీలకు యూపీఐ సర్వీసులపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. దాంతో డిజిటల్ పేమెంట్ ప్రక్రియలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అయితే, యూపీఐ సేవలు నిలిచిపోవడానికి అసలు కారణం ఇంకా తెలియదు.

సర్వర్ ఓవర్‌లోడ్‌లు, షెడ్యూల్ మెయింట్‌నెన్స్ లేదా ఇతర సైబర్ భద్రతా సమస్యలు కూడా కారణం కావచ్చు. ఈ అంతరాయంతో అనేక ఆర్థిక సంస్థలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా HDFC బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులకు సంబంధించి యూపీఐ సర్వీసులు నిలిచిపోయాయి.

Read Also : Mobile Network Issue : మీ మొబైల్‌లో నెట్‌వర్క్ ఇష్యూనా? కాల్స్ డ్రాప్ అవుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో ఫిక్స్ చేయొచ్చు.. ఓసారి ట్రై చేయండి..!

ఏప్రిల్ 8న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక నోటీసు జారీ చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఉపయోగించి చేసే అంతర్జాతీయ లావాదేవీలకు వినియోగదారులు QR కోడ్‌ని ఉపయోగించి చెల్లించే ఫీచర్ ఇకపై పనిచేయదని పేర్కొంది. భారత్‌లో యూపీఐ చెల్లింపుల కోసం QR కోడ్‌లను ఉపయోగించే వాటితో సహా ఇతర రకాల UPI లావాదేవీల పరిమితులకు ఎలాంటి మార్పులు ఉండవు.