Mobile Network Issue : మీ మొబైల్‌లో నెట్‌వర్క్ ఇష్యూనా? కాల్స్ డ్రాప్ అవుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో ఫిక్స్ చేయొచ్చు.. ఓసారి ట్రై చేయండి..!
Mobile Network Issue : మీ ఫోన్‌లో తరచుగా నెట్‌వర్క్ కనెక్షన్ సమస్యలు వస్తున్నాయా? జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లతో సమస్యలను ఫిక్స్ చేసే అద్భుతమైన టిప్స్ మీకోసం.. ఓసారి లుక్కేయండి.

Mobile Network Issue
Mobile Network Issue : ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ చాలా అవసరం. స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే డేటా వినియోగం కూడా అంతే స్థాయిలో పెరిగిపోయింది. ఈ రెండూ లేకుండా కొన్ని గంటలు కూడా గడపడం కష్టమే. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం వల్ల ముఖ్యమైన పనులు చాలా వరకు నిలిచిపోతాయి.
రోజువారీ పనుల్లో ఎక్కువ శాతం ఫోన్లలోనే జరుగుతున్నాయి. అలాంటి ఫోన్లలో సరైన నెట్‌వర్క్ లేనప్పుడు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రధానంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, VI వంటి ఇతర యూజర్లతో పాటు ఏదో ఒక సమయంలో ఈ నెట్‌వర్క్ సమస్యతో తరచుగా ఇబ్బంది పడుతుంటారు.
మీ స్మార్ట్‌ఫోన్ ఎంత హైఎండ్ మొబైల్ అయినా లేదా ఎన్ని కొత్త ఫీచర్లు ఉన్నా సరైన నెట్‌వర్క్ లేకుంటే ప్రయోజనం ఉండదు. మీరు వాడే ఏదైనా సిమ్ కార్డ్ నెట్‌వర్క్ కవరేజీని అందిస్తుంది. అయితే, మీకు నెట్‌వర్క్ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ సింపుల్ టిప్స్ ద్వారా ఫిక్స్ చేసుకోవచ్చు. అవేంటో ఓసారి వివరంగా పరిశీలిద్దాం..
మీ ఫోన్ నెట్‌వర్క్ సమస్యలుంటే వెంటనే ఇలా చేయండి :
- నెట్‌వర్క్ సరిగా లేకపోవడం వల్ల మీ కాల్స్ డ్రాప్ అవుతుంటాయి.
- మీ స్మార్ట్‌ఫోన్‌ను కొద్దిసేపు ఎయిర్‌ప్లేన్ మోడ్‌కి మార్చి ఆపై తిరిగి ఆన్ చేయండి.
- కొన్నిసార్లు మీ ఫోన్‌ను ఎక్కువసేపు వాడటం వల్ల నెట్‌వర్క్ సమస్యలు తలెత్తవచ్చు.
- మీరు చాలా రోజులుగా మీ ఫోన్ ఆఫ్ చేయకపోతే అలా చేయడం మంచిది.
- రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా అదే సమస్య ఉంటే.. మీ సెట్టింగ్స్‌కు వెళ్లి మొబైల్ నెట్‌వర్క్‌లకు నావిగేట్ చేయండి. నెట్‌వర్క్ ఆప్షన్ మార్చి చూడండి.
- అప్పటికీ కూడా నెట్‌వర్క్ కవరేజ్ సమస్య అలానే ఉంటే.. మీ SIM కార్డును రిమూవ్ చేయండి.
- ఏదైనా కాటన్ క్లాత్‌తో సున్నితంగా శుభ్రం చేసి ఆపై దాన్ని మీ ఫోన్‌లో తిరిగి ఇన్‌సర్ట్ చేయండి.
- నెట్‌వర్క్ సమస్యలు పాత సాఫ్ట్‌వేర్ వల్ల కూడా రావచ్చని గుర్తుంచుకోండి.
- మీ ఫోన్ కొంతకాలంగా అప్‌డేట్ కాకపోతే వెంటనే లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసుకోండి.