Telugu » Technology » Vivo 5g Enabled Smartphones Priced Under Rs 15000 In India Sh
VIVO 5G Smartphones : వివో లవర్స్‌కు కోసం రూ.15వేల లోపు ధరలో బెస్ట్ 5G ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!
VIVO 5G Smartphones : అద్భుతమైన ఫీచర్లు కలిగిన వివో 5జీ స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం రూ. 15వేల లోపు ధరలో లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఏదో ఎంచుకుని కొనేసుకోవచ్చు.
VIVO 5G Smartphones : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం 2025 మార్కెట్లో ఈ ఏప్రిల్‌లో అద్భుతమైన 5G వివో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. చాలామంది వివో యూజర్లకు ఏ ఫోన్ కొనాలో పెద్దగా అవగాహన ఉండదు. ఏదో ఒక ఫోన్ అంటూ కొనేస్తుంటారు. ఫీచర్ల కోసం కొందరు అయితే.. ధర తక్కువ ఉంటే చాలు అని భావిస్తుంటారు.
ఫీచర్లతో పాటు ధర కూడా మీ బడ్జెట్ ధరలో కొన్ని వివో 5జీ స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. వివో T3x 5G, వివో T3 లైట్ 5G, వివో Y36, వివో Y28e 5G, వివో Y28s 5G ఫోన్లు సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ ఏప్రిల్ 2025 నాటికి రూ. 15వేల లోపు ధరలో మార్కెట్లో లభించే వివో మోడళ్లలో కొన్ని 5జీ ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన వివో ఫోన్ కొనేసుకోండి.
ఈ వివో మోడల్‌లు మీ బడ్జెట్ ధరలో 5G కనెక్టివిటీని అందించే అనేక ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత వివో 5జీ ఫోన్ల ధరలతో పాటు కొనగోలు కోసం అధికారిక Vivo రిటైలర్ లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి. లేదంటే ఈ-కామర్స్ వెబ్ సైట్లలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చెక్ చేసి ఆ తర్వాతే కొనుగోలు చేయండి.