నేపాల్ అధ్యక్షుడికి గుండెపోటు
Nepal President Paudel hospitalised:నేపాల్ దేశ అధ్యక్షుడు రాంచంద్ర పౌడెల్‌కు శనివారం మళ్లీ గుండెనొప్పి వచ్చింది. గుండెనొప్పితో బాధపడుతున్న రాంచంద్ర పౌడెల్‌ను రెండో సారి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల్లో రెండోసారి గుండెనొప్పి రావడంతో(again after chest pain) రాంచంద్రను త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని అధ్యక్షుడి పర్సనల్ సెక్రటరీ చెప్పారు.
నేపాల్ దేశ అధ్యక్షుడు రాంసింగ్ ను మన్ మోహన్ కార్డియోథొరాసిక్ వాస్క్యూలర్ అండ్ ట్రాన్స్ ప్లాంట్ సెంటరులో చేర్చామని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పర్సనల్ సెక్రటరి చిరంజీబి అధికారి చెప్పారు. 78 ఏళ్ల వయసున్న రాంచంద్రను మొదటి సారి జూన్ 13వతేదీన గుండెనొప్పి రావడంతో ఖట్మాండులోని షాహిద్ గంగాలాల్ నేషనల్ హార్ట్ సెంటరులో యాంజియో ప్లాస్టీ చేయించారు. వైద్య పరీక్షల్లో గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు.
నేపాల్ అధ్యక్షుడికి రెండోసారి గుండె పోటు రావడంతో అతని అధికారిక నివాసమైన శీతల్ నివాస్ కు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అధ్యక్షుడిని ఐసీయూ కేబిన్ ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. గతంలో అనారోగ్యానికి గురైన రాంచంద్ర ఏప్రిల్ 19వతేదీన వైద్యచికిత్స కోసం భారత దేశంలోని ఢిల్లీకి శ్రీ ఎయిర్ లైన్స్ విమానంలో వెళ్లి ఎయిమ్స్ లో చికిత్స చేయించుకొని ఏప్రిల్ 30వతేదీన తిరిగి నేపాల్ వచ్చారు. ఆ తర్వాత రెండు సార్లు గుండె పోటుకు గురయ్యారు.