డైనోసర్ కాలం నుంచి మొసళ్లు మారకపోవడానికి కారణం

డైనోసర్ కాలం నుంచి మొసళ్లు మారకపోవడానికి కారణం

Updated On : January 10, 2021 / 6:52 PM IST

Crocodiles: మీ పరిసరాలను చూస్తే మీకు డైనోసార్ ఆనవాళ్లు కనిపిస్తాయి. వాటిని ఇప్పుడు మనం పక్షులుగా చూస్తున్నాం. ఎందుకంటే అవి రూపాంతరం చెందుతూ వస్తున్నాయి. డైనోసార్ లాంటి భారీ ఖాయం కాలంతో పాటు మారుతూ జీవుల పరిమాణంలోనూ తేడాలు వస్తున్నాయి. కానీ, 200మిలియన్ సంవత్సరాల నుంచి ఉన్న మొసళ్లు మాత్రం మారలేదు.

ఆకులను తినే డైనోసర్స్, వేగంగా పరిగెత్తేవి అస్సలు కనిపించకుండానే పోయాడు. బ్రిస్టల్ లోని ఓ యూనివర్సిటీ సైంటిస్టులు.. చేపట్టిన కొత్త రీసెర్చ్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

మొసళ్ల పుట్టుక అనేది చాలా స్లోగా ఉంటుంది. ఏదైనా జీవి వాతావరణం మారితే దానికి తగ్గట్లు అలవాటు చేసుకోవాలి. వాతావరణం ఉష్ణోగ్రతతో పాటు.. పలు పరిస్థితులకు తగ్గట్లుగా అవి మార్చుకుంటూ ఉంటాయి. నీళ్లలో గంటపాటు ఉండగల మొసళ్లు పూర్తి చీకటిలోనూ ఉండగలవు. తీవ్రమైన గాయాలను కూడా తట్టుకుని నిలబడగలవు.

నమ్మినా నమ్మకపోయినా మొసళ్లలో ఇది అసాధారణ లక్షణం. ఒకవేళ వాటి కాలు విరిగిపోయిన తర్వాత కూడా 70 నుంచి 100 సంవత్సరాల వరకూ బతకగలవు.

ఈ డైనోసర్ జాతులు అన్ని 66మిలియన్ సంవత్సరాల క్రితం సంభవించిన ఆస్టరాయిడ్ ప్రమాదం వల్ల అతలాకుతలం అయ్యాయి. మొసళ్లు మాత్రం సూర్యుడి నుంచి శక్తిని కూడదీసుకుని ఉండగలిగాయి. ఇతర జీవులు అలా నిలబడలేకపోయాయి. అలా వాటి లైఫ్ జర్నీ కొనసాగిస్తూనే ఉన్నాయి.

స్టడీలో భాగంగా వాటి శరీర పరిణామాన్ని చాలా కీలకంగా పరిగణించారు. మొసళ్లకు ఎంత ఆహారం తీసుకుంటే సరిపోతుంది. వాటి జనాభా ఎంత ఉంది. అవి ఎలా ఉండాలనుకుంటాయి. ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ వల్లనే ఉండగలుగుతున్న మొసళ్లలో కొన్ని మాత్రం కనిపించకుండా ఎందుకుపోయాయనే దానిపై తర్వాతి స్టడీ జరగనుందని నిపుణులు అంటున్నారు.