Husband
Husband For Sale: డబ్బు కోసం కట్టుకున్న భర్తను రూ.కోటికి అమ్మేస్తుంది భార్య. ఇది మనం చూసిన ఒక తెలుగు సినిమా. సరిగ్గా అటువంటి ఘటనే నిజజీవితంలోనూ వెలుగు చూసింది. అయితే మనదేశంలో కాదులెండి. న్యూజీలాండ్ దేశంలో నివసిస్తున్న లిండా మెక్‌అలిస్టర్ అనే మహిళ..తన భర్తను వేలానికి పెట్టింది. ఇద్దరు పిల్లల తల్లైన లిండా..తన భర్తను $25 ప్రారంభ ధరకు “ట్రేడ్ మీ(Trade Me)” అనే ఆన్‌లైన్ వేలం సంస్థలో వేలానికి పెట్టింది. తన భర్త..తమను ఒంటరిగా వదిలి..పర్యటనకు వెళ్లడంతో కోపగించుకున్న లిండా ఈ నిర్ణయం తీసుకుంది.
Also read: Hyderabad Traffic: “ఫ్రీ లెఫ్ట్”తో ట్రాఫిక్ సమస్యకు చెక్, త్వరలో ఇతర జుంక్షన్ల వద్ద అమలు
పర్యటనకు వెళ్లిన భర్త రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో.. విసుగు చెందిన లిండా..ఇలా ఏదైనా కొంటె పనిచేసి అతనికి బుద్ధి చెప్పాలని ఈ పనిచేసింది. అందుకు “ట్రేడ్ మీ” వెబ్ సైట్ లో తన భర్త గురించి అన్ని వివరాలు నమోదు చేసింది. “మనిషి మంచోడే, కానీ అప్పుడప్పుడు మద్యం పోస్తూ ఉండాలి..ఇల్లు, భార్య, పిల్లల కంటే ఎక్కువగా బీరును ప్రేమిస్తాడు. చేపలు పట్టడం, వ్యవసాయం చేయడం ప్రధాన వృత్తి. రోజుల తరబడి ఒక్కడే పర్యటనలకు వెళ్తుంటాడు” అంటూ సరదాగా వివరాలు నమోదు చేసింది. అయితే ఆ వేలం ప్రకటన సుమారు వారం పాటు ఆన్‌లైన్‌లోనే ఉండడంతో.. కొందరు మహిళలు భర్తను కొనుక్కునేందుకు ఆసక్తి కనబరిచారు.
“కొనుక్కకున్నాక గ్యారంటీ ఉంటుందా, ఎందుకు అమ్మాలనుకుంటున్నారు, ఎన్ని రోజులుగా వాడుతున్నారు.. ఏదైనా సమస్య వస్తే ఇంటికి వచ్చి సర్వీస్ ఇస్తారా” అంటూ మార్కెట్లో కొనుగోలుచేస్తున్నట్టుగా ప్రశ్నలు అడిగారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ లిండా సరదాగా సమాధానాలు చెప్పింది. మొత్తంగా $25 డాలర్లకు భర్తను వేలానికి పెట్టగా.. వారం వ్యవధిలో $100 డాలర్లు మాత్రమే ధర పలికింది. అయితే లిండా చేసిన సరదా పనిని గుర్తించిన వేలం సంస్థ.. ఆ పోస్టును తొలగించింది.