Hyderabad Traffic: “ఫ్రీ లెఫ్ట్”తో ట్రాఫిక్ సమస్యకు చెక్, త్వరలో ఇతర జుంక్షన్ల వద్ద అమలు

ఇప్పటికే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సక్సెస్ అయిన ఫ్రీలెప్ట్ పద్ధతిని.. నగరంలోని ఇతర రద్దీ జంక్షన్ల వద్ద అమలు చేసేయోచనలో ఉన్నట్లు తెలిపారు.

Hyderabad Traffic: “ఫ్రీ లెఫ్ట్”తో ట్రాఫిక్ సమస్యకు చెక్, త్వరలో ఇతర జుంక్షన్ల వద్ద అమలు

Keep Left

Hyderabad Traffic: హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరిగిపోతున్న వాహన రద్దీతో అటు వాహనదారులు, ఇటు పోలీసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వాహనదారుల్లో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన లేకపోవడంతో.. ఒకరి కారణంగా మరొకరు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక రోడ్డుపై గంటల కొద్ది.. వాహనాలు బారులు తీరుతుండడంతో.. వాహనాలు నియంత్రించలేక ట్రాఫిక్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జుంక్షన్ల వద్ద ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫ్రీ లెఫ్ట్ విధానం.. ట్రాఫిక్ ను కొంతమేర తగ్గిస్తుండడంతో నగరంలోని ఇతర ప్రధాన జంక్షన్ల వద్ద ఈ ఫ్రీ లెఫ్ట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) రంగనాథ్ తెలిపారు. జేసీపీ రంగనాథ్ తో 10టీవీ ప్రతినిధి శనివారం నాడు ప్రత్యేకంగా మాట్లాడారు.

Also read: Extra Marital Affair : భార్య ఆధార్ కార్డుతో ప్రియురాలితో హోటల్‌లో గడిపిన వ్యక్తిపై కేసు

హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లలో భారీ మార్పులు చేయనున్నట్లు జేసీపీ రంగనాథ్ వివరించారు. పలు జంక్షన్ల వద్ద రాకపోకలపై త్వరలో ఆంక్షలు విధించనున్నట్లు పేర్కొన్న ఆయన.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, లంగర్‌హౌజ్, నానల్ నగర్..రవీంద్రభారతి, కంట్రోల్ రూమ్‌తోపాటు పలు జంక్షన్ల వద్ద మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సక్సెస్ అయిన ఫ్రీలెప్ట్ పద్ధతిని.. నగరంలోని ఇతర రద్దీ జంక్షన్ల వద్ద అమలు చేసేయోచనలో ఉన్నట్లు తెలిపారు. ఫిల్మ్‌నగర్ నుంచి రోడ్డు నెంబర్ 10 వైపు వెళ్లే హనాలన్నింటినీ..జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి ఫ్రీ లెప్ట్ ఇచ్చి మళ్లించనున్నారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వచ్చే వాహనాలన్నింటినీ నేరుగా..పంజాగుట్టకు చేరుకునేలా ట్రాఫిక్ మళ్లింపు చేయనున్నారు.

Also read: Sai Pallavi : నాగశౌర్య వ్యాఖ్యలపై మూడేళ్ళ తర్వాత స్పందించిన సాయి పల్లవి

వాహనాలు జంక్షన్ల వద్ద నిలిచిపోవడంతో.. వాహనదారుల ఇక్కట్లు గుర్తించి ఆమేరకు ఈ మార్పులు చేస్తున్నట్లు జేసీపీ రంగనాథ్ వివరించారు. ఇప్పటికే నగరంలోని రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ల మార్పులపై ప్రణాళికలు సిద్ధం చేసిన ట్రాఫిక్ పోలీసులు.. రానున్న వారంరోజుల్లో ఆయా జంక్షన్ల వద్ద ట్రయల్స్ నిర్వహించనున్నారు. వీఐపీ పర్యటనల సమయంలో.. గవర్నర్, ముఖ్యమంత్రి కాన్వాయ్ మినహా.. ఇతరాలు వాహనశ్రేణికి ట్రాఫిక్ నిబంధనలు సడలించేది లేదని జేసీపీ రంగనాథ్ పేర్కొన్నారు.

Also read: Double Murder Case : టంగుటూరు జంట హత్యల కేసులో నిందితులు గుర్తింపు