PM Modi : హైదరాబాద్‌‌కు చేరుకున్న ప్రధాని.. ఇక్రిశాట్ కొత్త లోగో, శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ

సాయంత్రం ఏడు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని లోకార్పణం చేస్తారు.

PM Modi : హైదరాబాద్‌‌కు చేరుకున్న ప్రధాని.. ఇక్రిశాట్ కొత్త లోగో, శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ

Modi

PM Modi in Hyderabad : ప్రధాని నరేంద్ర మోదీ మరి హైదరాబాద్‌‌కు చేరుకున్నారు. 2గంటల పది నిమిషాలకు శంషాబాద్‌లో ప్రధాని ల్యాండ్ అయ్యారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎస్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు మోదీ వెళ్తారు. ఇక్రిశాట్ సర్వోర్ణత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం.. సంస్థ కొత్త లోగోను ప్రధాని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి నాలుగున్నర గంటలకు తిరిగి శంషాబాద్‌కు ప్రధాని చేరుకుంటారు. ఐదు గంటలకు ముచ్చింతల్‌కు చేరుకుని పది నిమిషాల పాటు రెస్ట్ తీసుకుంటారు. సాయంత్రం ఏడు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని లోకార్పణం చేస్తారు.

కాసేపట్లో ప్రధాని మోదీ ఇక్రిశాట్‌కు చేరుకోబోతున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్తారు. ఆకలితో అలమటించే నిరుపేదలకు ఆహార భద్రతనిచ్చే లక్ష్యంతో ఏర్పాటైన ఇక్రిశాట్‌కు నేటికి 50 ఏళ్లు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని చాలా దేశాల్లో సాగునీటి కొరతతో సరిగ్గా పంటలు పండవు. వారందరికి ఆహార భద్రతనిచ్చే దిశగా ఇక్రిశాట్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆసియా, ఆఫ్రికాలోని 210 కోట్ల మంది ప్రజలకు ఇక్రిశాట్‌ సేవలందిస్తోంది.

Hyderabad Traffic: “ఫ్రీ లెఫ్ట్”తో ట్రాఫిక్ సమస్యకు చెక్, త్వరలో ఇతర జుంక్షన్ల వద్ద అమలు

1972లో అంటే 50 ఏళ్లక్రితం రెండు ఫౌండేషన్లు భారత ప్రభుత్వ సహకారంతో హైదరాబాదుకు సమీపంలోని పటాన్‌చెరులో ఇక్రిశాట్‌ను ఏర్పాటు చేశాయి. అధిక దిగుబడినిచ్చే 1,135 రకాల కొత్త వంగడాలను ఇప్పటిదాకా ఇక్రిశాట్‌ 81 దేశాలకు పంపిణీ చేసింది. మొత్తం 149 దేశాల్లో 15 లక్షలకు పైగా విత్తన నమూనాలను రైతులకు అందించింది. ప్రపంచవ్యాప్తంగా 144 దేశాలకు చెందిన వివిధ రకాల పంటలు, వంగడాలకు చెందిన లక్షా 28 వేలకు పైగా జన్యువులను భవిష్యత్తు ఆహార భద్రతకోసం ఇక్రిశాట్‌ జన్యు బ్యాంకులో భద్రపరచింది.

మొజాంబిక్‌, టాంజానియా, జింబాబ్వే వంటి పేదదేశాల్లో ఈ సంస్థ శాస్త్రవేత్తలు చేపట్టిన కార్యక్రమాల కారణంగా పంటల దిగుబడి 28 శాతం నుంచి 313 శాతం దాకా పెరిగింది. పలుదేశాల్లోని రైతులకు ఇచ్చిన శిక్షణలతో పంటలకు వాడే సాగునీటి వినియోగాన్ని 40-85శాతం మేర తగ్గించారు. భారత ప్రభుత్వం, ఇక్కడి జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు అందిస్తున్న సహకారంతో దేశీయ రైతులతో కలిసి ఇక్రిశాట్‌ ప్రయోగాలు చేస్తోంది. ఇక్కడి నాణ్యమైన విత్తనాలను ఆఫ్రికా ఖండంలోని 13 దేశాల్లో అందించి సాగుచేయించి ఎన్నో సత్ఫలితాలు సాధించింది. తద్వారా నిరుడు ఇక్రిశాట్‌కు ఆఫ్రికా ఫుడ్‌ పురస్కారం కూడా దక్కించుకుంది.

PRC Protest: ‘రేపటిలోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం’

సైన్స్‌ విత్‌ హ్యుమన్‌ ఫేస్‌ నినాదంతోనే ముందుకు వెళుతుంది ఇక్రిశాట్‌. మొత్తం 3 వేల 434 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ సంస్థ. మామాలుగా ఒక కొత్త వంగడం రూపొందించడానికి దశాబ్ధ కాలం పడుతుంది. కానీ ర్యాపిడ్ జెన్ కేంద్రం ఏర్పాటు చేసిన ఇక్రిశాట్‌.. ఏడాదిన్నరలోనే కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తుంది.. ఇలా నిరంతర కృషితో దూసుకుపోతున్న ఇక్రిశాట్‌ నేడు స్వర్ణోత్సవాలను జరుపుకుంటుంది. విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు.. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సత్య సంకల్పంతో.. దివ్య సాకేతంలో రూపొందిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహం జాతికి అంకింతం చేయనున్నారు.