PRC Protest: ‘రేపటిలోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం’

ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ సమస్యల ఆందోళనలపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారని...

PRC Protest: ‘రేపటిలోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం’

Balineni

Updated On : February 5, 2022 / 2:29 PM IST

PRC Protest: ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ సమస్యల ఆందోళనలపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారని రేపటి లోగా అన్నీ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని హామీ ఇచ్చారు.

‘ఎన్టీపీసీకి 350కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్న విషయం వాస్తవమే. టీడీపీ హయాంలో చేసిన వేల కోట్ల రూపాయల బకాయిలు అప్పజెప్పి వెళ్లారు. రెండ్రోజుల విద్యుత్ కోతలకు కారణం అదే. పైగా టీడీపీ నానా గోల చేస్తుంది. ప్రస్తుతం విద్యుత్ లోటు అధిగమించేందుకు సీఎం జీగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల్లో అన్నీ సమస్యలు పరిష్కరించి.. ఏ సమస్య లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’

‘పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన చేసిన సత్యసాయి జిల్లాపై బాలకృష్ణ అంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తండ్రి ఎన్టీఆర్ పేరిట కూడా ఓ జిల్లాను ప్రకటించాం. టీడీపీ హయాంలో అది కూడా చేసుకోలేకపోయారు. ఇవాళ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు అడుగుతున్నారు. అదే అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా కేంద్రానికి ఓ లేఖ అయినా రాశారా’

Read Also : హైదరాబాద్ పర్యటనపై మోడీ ట్వీట్

‘ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల పేర్లు మారటం సహజం. మానసిక పరిస్దితి సరి లేని సుబ్బారావు గుప్తా విషయంలో స్పందించాలంటే సిగ్గుగా ఉంది. సుబ్బారావు గుప్తా వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో అన్నీ తెలుసు’

‘తుని ఘటనలో అక్రమంగా ఆరోజున నమోదు చేసిన కేసులు ఎత్తివేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.