న్యూస్ పేపర్‌లోనే టాయిలెట్ పేపర్ కూడా!

కరోనా వైరస్ భయంతో ఆస్ట్రేలియాలోని ప్రజలంతా టాయిలెట్ పేపర్లను బల్క్ లో కొని ఇళ్లల్లో పెట్టుకున్నారు. వాస్తవానికి, కొన్ని షాపుల్లో టాయిలెట్ పేపర్ల ర్యాక్ లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో టాయిలెట్ పేపర్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదని అధికారులు గట్టిగా చెప్తున్నా కూడా ఈ కొనుగోళ్లు తగ్గటం లేదు. ఈ టాయిలెట్ పేపర్ సమస్య ఒక్క ఆస్ట్రేలియాకు మాత్రమే కాదు. సింగపూర్, జపాన్, హాంగ్ కాంగ్ వంటి ఇతర దేశాల్లోనూ ఇటువంటి పరిస్థితి తలెత్తింది.
ఇక ఆస్ట్రేలియాలో బుధవారం (మార్చి 4, 2020)నాటికి 42 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు చనిపోయారు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. దీంతో, ఎక్కువ కాలం నిల్వ చేసుకోగల ఆహారం, సరకుల కన్నా ముందు టాయిలెట్ పేపర్లకు డిమాండ్ పెరిగిపోయింది.
అందుకని ఒక వార్తాపత్రిక పరిష్కారంతో ముందుకు వచ్చింది. గురువారం (మార్చి 5, 2020) ప్రజలు టాయిలెట్ పేపర్ గా ఉపయోగించడానికి ఎనిమిది అదనపు పేజీలను ముద్రించారు. ఓ వ్యక్తి ఆ పేపర్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను 2.8 లక్షలకు పైగా చూశారు. 5వేలకు పైగా లైకులు వచ్చాయి.
YES, WE ACTUALLY DID PRINT IT #toiletpapercrisis pic.twitter.com/jusP50ojYu
— The NT News (@TheNTNews) March 4, 2020
See Also | ఇద్దరి ప్రాణాలు తీసిన లాఫీంగ్ గ్యాస్ !