×
Ad

Nicolas Maduro : అరెస్టు చేసి తీసుకెళ్తున్న యూఎస్ అధికారులతో మదురో అన్నమాటలు ఇవే.. వీడియో వైరల్

Nicolas Maduro : అమెరికా సైన్యం నికొలస్ మదురోను బంధించి న్యూయార్క్ నగరంలోని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని కేంద్రానికి తరలించారు. యూఎస్ కు తీసుకొచ్చే సమయంలో మదురో చేతికి సంకెళ్లు వేశారు.

Nicolas Maduro

Nicolas Maduro : వెనెజువెలాపై అమెరికా మెరుపు వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. వెనెజులా రాజధాని కారకాస్ సిటీపై అమెరికా యుద్ధ విమానాలు మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించాయి. ప్రధానంగా రాజధాని కారకాస్ నగరంతో పాటు మిరాండా, అరాగువా, లాగువైరా రాష్ట్రాల పరిధిలోని నగరాలు, నౌకాశ్రయాలు, సైనిక స్థావరాలపై దాడులు జరిగినట్టు తెలుస్తోంది. వైమానిక దాడుల తర్వాత వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని యూఎస్ తరలించాయి

Also Read : Nicolas Maduro: బస్ డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడి వరకు… ఎవరీ నికోలస్ మదురో, దేశాధ్యక్షుడు ఎలా అయ్యారు, సంపద ఎంత

వెనెజువెలాపై దాడి చేసిన అమెరికా బలగాలు సైనిక స్థావరంలోని ఇంట్లో ఉన్న మదురో దంపతులను పట్టుకుని.. వారిని బెడ్ రూం నుంచి లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. మదురో, ఆయన భార్య సిలియాను అమెరికా చట్టాల ప్రకారం న్యూయార్క్‌లోని కోర్టుల్లో విచారిస్తామని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ తెలిపారు.

అమెరికా సైన్యం నికొలస్ మదురోను బంధించి న్యూయార్క్ నగరంలోని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని కేంద్రానికి తరలించారు. యూఎస్‌కు తీసుకొచ్చే సమయంలో మదురో చేతికి సంకెళ్లు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో నికొలస్ మదురో యూఎస్ సిబ్బందికి హ్యాపీ న్యూఇయర్ చెబుతున్నట్లు ఉంది.

Also Read : Bhogapuram Airport : ఎగిరే చేప డిజైన్.. 200 విమానాలు ల్యాండయ్యే సామర్థ్యం.. భారీ తుఫాన్లు తట్టుకునే కెపాసిటీ.. భోగాపురం విమానాశ్రయం ప్రత్యేకతలు మరెన్నో..

వీడియో ప్రకారం.. సంకెళ్లతో మదురోను తీసుకెళ్తున్న సమయంలో యూఎస్ అధికారులతో మదురో మాట్లాడారు.. వారికి గుడ్‌నైట్ చెప్పారు. దీంతోపాటు నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.