Nicolas Maduro: బస్ డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడి వరకు… ఎవరీ నికోలస్ మదురో, దేశాధ్యక్షుడు ఎలా అయ్యారు, సంపద ఎంత

మదురో 2006 నుండి 2013 వరకు వెనిజులా విదేశాంగ మంత్రిగా, ఆ తర్వాత ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. Nicolas Maduro

Nicolas Maduro: బస్ డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడి వరకు… ఎవరీ నికోలస్ మదురో, దేశాధ్యక్షుడు ఎలా అయ్యారు, సంపద ఎంత

Nicolas Maduro Representative Image (Image Credit To Original Source)

Updated On : January 4, 2026 / 12:23 AM IST
  • 1962లో కారకాస్‌లో జన్మించిన నికోలస్ మదురో
  • నికోలస్ మదురో ఓ బస్ డ్రైవర్‌
  • మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌కు సన్నిహిత మిత్రుడు
  • చావెజ్ మరణానంతరం అధ్యక్షుడిగా బాధ్యతలు

Nicolas Maduro: వెనెజువెలాపై అమెరికా మెరుపు వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. వెనెజులా రాజధాని కారకాస్ పై అమెరికా యుద్ధ విమానాలు మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించాయి. ప్రధానంగా రాజధాని కారకాస్ నగరంతో పాటు మిరాండా, అరాగువా, లా గువైరా రాష్ట్రాల పరిధిలోని నగరాలు, నౌకాశ్రయాలు, సైనిక స్థావరాలపై దాడులు జరిగినట్టు తెలుస్తోంది. వైమానిక దాడుల తర్వాత వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని యుఎస్ తరలించాయి.

ఈ సంఘటనల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి నికోలస్ మదురోపైనే పడింది. అసలు ఎవరీ నికోలస్ మదురో.. గతంలో ఏం చేసే వాడు, దేశాధ్యక్షుడు ఎలా అయ్యాడు, అతడి సంపద ఎంత, ఆస్తులు ఎన్ని.. ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు యావత్ ప్రపంచం ఆసక్తి చూపుతోంది.

బస్ డ్రైవర్ నుండి అధ్యక్షుడి వరకు..

నికోలస్ మదురో మోరోస్ 1962లో కారకాస్‌లో జన్మించారు. కారకాస్ మెట్రో వ్యవస్థలో బస్ డ్రైవర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కార్మిక సంఘాలలో ఆయన భాగస్వామ్యం రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌కు సన్నిహిత మిత్రుడిగా మారారు.

మదురో 2006 నుండి 2013 వరకు వెనిజులా విదేశాంగ మంత్రిగా, ఆ తర్వాత ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2013లో చావెజ్ మరణానంతరం, వివాదాస్పద ఎన్నికల తర్వాత ఆయన అధ్యక్ష పదవిని చేపట్టారు. ఆ తర్వాత 2018 మరియు 2024లో తీవ్ర పోటీతో కూడిన ఎన్నికల ద్వారా ఆయన అధికారాన్ని నిలబెట్టుకున్నారు.

మదురో నాయకత్వంలో వెనిజులా అధిక ద్రవ్యోల్బణం, ఆహారం, మందుల దీర్ఘకాలిక కొరత ఎదుర్కొంది. దేశం సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఫలితంగా లక్షలాది మంది దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. మదురో ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ అధికారులు క్రిమినల్ నెట్‌వర్క్‌ల ద్వారా బిలియన్ల కొద్దీ చమురు ఆదాయాన్ని స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. అయినప్పటికీ, తనను తాను కార్మిక వర్గానికి రక్షకుడిగా మదురో చిత్రీకరించుకున్నారు. తరచుగా తన సామాన్య నేపథ్యాన్ని ప్రస్తావించే వారు.

Nicolas Maduro

Nicolas Maduro Representative Image (Image Credit To Original Source)

మదురో నికర ఆస్తుల విలువ

సెలబ్రిటీ నికర విలువ (2025):
అంచనా వేయబడిన నికర విలువ: 2 మిలియన్ డాలర్లు.. రాజకీయపరంగా వచ్చే ఆదాయం, ఆస్తుల ఆధారంగా

యాహూ ఫైనాన్స్ (2025):
అంచనా వేయబడిన నికర సంపద: 2 మిలియన్ డాలర్లు

రియాలిటీ టీ (2025):
అంచనా వేయబడిన నికర ఆస్తి విలువ: 1 మిలియన్ డాలర్లు
జీతం, తెలిసిన ఆస్తుల ఆధారంగా

బీబీఎన్ టైమ్స్ (2025):
అంచనా వేయబడిన నికర ఆస్తి విలువ: 2 మిలియన్ డాలర్లు
జీవిత చరిత్ర, రాజకీయ విశ్లేషణకు సంబంధించినది

మదురో అధికారిక అధ్యక్ష వేతనం నెలకు సుమారు 4వేల డాలర్లుగా అంచనా. ప్రపంచ ప్రమాణాల ప్రకారం ఇది తక్కువగా ఉన్నప్పటికీ, దీనితో పాటు నివాసాలు, రవాణా, భద్రతతో సహా విస్తృతమైన ప్రభుత్వ సౌకర్యాలు లభిస్తాయి.

అధికారిక లెక్కల కంటే మదురో నిజమైన సంపద చాలా ఎక్కువ అన్న విమర్శలు ఉన్నాయి. అవినీతి, మనీలాండరింగ్ దర్యాప్తులలో భాగంగా, అమెరికా అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా అతనికి సంబంధించిన 700 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ప్రైవేట్ జెట్‌లు, విలాసవంతమైన వాహనాలు, ఆస్తులు ఉన్నాయి.

2020లో, అమెరికా అధికారికంగా మదురోపై నార్కో-టెర్రరిజం ఆరోపణలపై అభియోగం మోపింది. అతని అరెస్టుకు దారితీసిన సమాచారం కోసం 15 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. మదురోనే కాదు అతడి కుటుంబసభ్యులపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. మదురో భార్య సిలియా ఫ్లోర్స్, ఆమె బంధువులు లంచగొండి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2015లో మదురో సవతి కుమారులు వందల కిలోగ్రాముల కొకైన్‌ను దేశంలోకి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారని అమెరికా అధికారులు ఆరోపించారు.

Also Read: సౌదీ, యూఏఈ ఎందుకు కొట్టుకుంటున్నాయి? రెండు పవర్‌ఫుల్ ఇస్లామిక్‌ దేశాల మధ్య గొడవ ఏంటి?