Nigeria: భయంకరమైన వరదలు.. ప్రాణాలు కోల్పోయిన 600 మంది.. నిరాశ్రాయులైన 13 లక్షల మంది

Nigeria: చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరదలు నైజీరియా దేశాన్ని ముంచెత్తాయి. ఏ ఊరు చూసినా వరదలే.. ఏ ప్రాంతం చూసినా ఉప్పొంగుతున్న నదులే. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశం దాదాపు నీటిలోనే మునిగిపోయింది. నైజీరియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద విపత్తని ప్రభుత్వం వెల్లడించిందంటే.. వరదలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు.

కాగా, వరదల కారణంగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 600 మంది చనిపోయినట్లు ఆ దేశ ప్రభుత్వ యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. ఇక 13 లక్షల మంది నిరాశ్రాయులయ్యారు. సుమారు 2 లక్షల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లక్షలాది ఎకరాల పంట మొత్తం నీట మునిగింది. వాస్తవానికి వరదలపై ప్రమాద హెచ్చరికలు ముందునుంచే ఉన్నప్పటికీ సకాలంలో చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రజలను అప్రమత్తం చేయడం, సురక్షిత ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం లాంటి వాటిలో అధికారులు సరిగా వ్యవహరించలేదట. పేలవమైన ప్రణాళికలతో వరద ముప్పును మరింత తీవ్ర స్థాయికి తీసుకువచ్చారని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. నైజీరియాలో ప్రతిఏటా భారీ వర్షాలు పడుతూనే ఉంటాయి. వరదలు కూడా సంభవిస్తూనే ఉంటాయి. అయితే ఈసారి కురిసిన వర్షపాతం చాలా ఎక్కవట.దీని వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం కూడా చాలా ఎక్కువేనని ప్రభుత్వం అధికారికంగా పేర్కొంది.

Greater Noida: పరీక్షలో ఫెయిలైనందుకు చితకబాదిన టీచర్.. తీవ్ర గాయాలతో 12 ఏళ్ల విద్యార్థి మృతి

ట్రెండింగ్ వార్తలు