Airplane Crash : కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి

విమాన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు విడిచిన ఘటన కరేబియన్‌ దీవుల్లోని డొమినికన్‌ రిపబ్లిక్‌లో చోటుచేసుకుంది.

Airplane Crash

Airplane Crash : విమాన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు విడిచిన ఘటన కరేబియన్‌ దీవుల్లోని డొమినికన్‌ రిపబ్లిక్‌లో చోటుచేసుకుంది. ఏడుగురు ప్రయాణికులు ఇద్దరు సిబ్బందితో ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్తుండగా టేకాఫ్ అయిన 15 నిమిషాలకే సమస్య వచ్చింది. దీంతో విమానాన్ని శాంటో డొమింగోలో ఉన్న లాస్‌ అమెరికాస్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా లాండ్‌ చేశారు ఫైలెట్స్. ల్యాండ్ అయిన కొద్దీ క్షణాల్లోనే విమానం పేలిపోయింది.

చదవండి : CDS chopper Crash : కన్నుమూసిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్, సంతాపం తెలిపిన మోదీ

ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 9మంది మృతి చెందినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. మృతుల్లో ఆరుగురు విదేశీ ప్రయాణికులు ఉండగా.. ఇద్దరు విమాన సిబ్బందితోపాటు డొమినికన్‌ రిపబ్లిక్‌ కు చెందిన మరో వ్యక్తి మృతి చెందినట్లు పేర్కొన్నారు. విదేశీ ప్రయాణికుల పూర్తి సమాచారం లేదని.. వారు ఏ దేశానికి చెందినవారనేది తెలియరాలేదని స్థానిక మీడియా వెల్లడించింది.

చదవండి : IAF Chopper Crash : నాన్నా.. నేనూ ఆర్మీలో చేరుతా! అమర జవాన్ టోపీ ధరించి కొడుకు సెల్యూట్.. వీడియో వైరల్