Pakistan : ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళలతో సహా తొమ్మిది మంది హత్య..

కొంతమంది తుపాకులతో వచ్చి ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో కుటుంబంలో తొమ్మిదిమంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Crime

Pakistan Crime : పాకిస్థాన్ (Pakistan )లో అంత్యంత దారుణం చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు ఒక కుటుంబం తుపాకులతో దాడి చేసి తొమ్మిదిమందిని హతమార్చారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మలాకంద్ జిల్లా (Malakand district )లోని బత్‌ఖేలా తహసీల్ (Batkhela Tehsil)లోని బగర్దారా (Bagardara) ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది. వారంతా నిద్రిస్తున్న సమయంలో బుధవారం (జూన్ 28,2023) తెల్లవారుఝామున 2 గంటల సమయంలో కొంతమంది తుపాకులతో వచ్చి ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో కుటుంబంలో తొమ్మిదిమంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తుపాకీ తూటాలకు ముగ్గురు మహిళలు, ఆరుగురు పురుషులు చనిపోయారు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Pragati Maidan Tunnel: ఢిల్లీలో హైటెక్ చోరీలు.. కార్లు ఆపని టన్నెల్‭ కేంద్రంగా నేరాలు

దర్యాప్తు(investigation)లో భాగంగా పోలీసులు స్థానికులతో పాటు పలువురుని ప్రశ్నించారు. ఆ కుటుంబానికి చెందిన అల్లుడు (son-in-law)ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఈ హత్యలు (killings)చేశాడని పోలీసులు భావిస్తున్నారో ఆ వ్యక్తి భార్య (Wife)అతనితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఈక్రమంలో అతనికి ఆ కుటుంబానికి మధ్య గత కొంతకాలంలో గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో సదరు వ్యక్తి ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడు (suspect) స్వాత్ (Swat) కు చెందిన వ్యక్తిగా పోలీసులు (Police)గుర్తించారు.

మృతులు హసన్ షా(Hasan Shah), హజ్రత్ అలీ(Hazrat Ali),హజ్రత్ బిలాల్(Hazrat Bilal), జోహ్రాన్(Zohran),జెహ్రాన్(Zehran),రబియా(Rabia), రుక్కయా బీబీ(Ruqqaya bibi), హసన్ షా(Hasan shah) భార్య హబీబా(Habiva)గా గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడినవారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కాల్పుల ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.