Kabul Airport: పాలు కాదు నీళ్లు కూడా లేవు.. పసిపిల్లలతో కాబుల్ ఎయిర్‌పోర్టులో గంటల తరబడి నిరీక్షణ

దాదాపు వారం రోజుల తర్వాత అఫ్ఘానిస్తాన్ వాసులను తరలించేందుకు ఇండియా ప్రభుత్వం రోజుకు రెండు విమానాలు నడిపేందుకు రెడీ అయింది. వందల మంది తల్లులు నిస్సహాయ స్థితిలో ..

Afghanistan (1) (1)

Kabul Airport: దాదాపు వారం రోజుల తర్వాత అఫ్ఘానిస్తాన్ వాసులను తరలించేందుకు ఇండియా ప్రభుత్వం రోజుకు రెండు విమానాలు నడిపేందుకు రెడీ అయింది. వందల మంది తల్లులు నిస్సహాయ స్థితిలో పిల్లలతో ఎయిర్‌పోర్టులోనే నిరీక్షిస్తున్నారు. కొద్ది రోజులుగా ఎయిర్ ఫోర్స్ పలు చోట్ల నుంచి ప్రజలను ఎక్కించుకుని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఇండియాకు చెందిన ఓ తల్లి.. అఫ్ఘాన్ క్యాపిటల్ అయిన కాబుల్ ఎయిర్‌పోర్టులో నిరీక్షిస్తున్నారు. రెండేళ్ల మనుమడు, ఆమె కూతురు బతకడానికే ఇబ్బందిపడుతున్నారు. అఫ్ఘానిస్తాన్ కు కోడలు అయిన 32ఏళ్ల భారతీయ మహిళ అక్కడే మూడు రోజులుగా ఎదురుచూస్తుంది.

‘మూడు రోజుల ముందు ఇండియన్ ఎంబస్సీలో ఉన్న మనుషులకు ఇలా చెప్పారు. లగేజి లేకుండా ఎయిర్ పోర్టుకు వెళ్లాలని అన్నారు. అలా మూడు రోజులుగా ఎయిర్ పోర్టు దగ్గర్లో ఉన్న వెడ్డింగ్ హాల్ లోనే అడుగు బయటపెట్టకుండా ఎదురుచూస్తున్నాం’ అని ఆ మహిళ చెప్తుంది.

శుక్రవారం రాత్రి 12గంటల సమయంలో బస్ లో ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లారు. వాళ్లంతా దాదాపు ఉదయం 11గంటల వరకూ అక్కడే ఎదురుచూశాం. తాలిబాన్లు వచ్చి దాదాపు 150మందిని తీసుకుపోయారు. నా మేనల్లుడు ఇక్కడికి దగ్గర్లోనే ఉంటాడు. దీంతో నా కూతురిని అతనికి అప్పగించి సురక్షితంగా వేరే చోటికి పంపించగలిగాను.

ఇప్పుడు వాళ్ల డాక్యుమెంట్లు చెక్ చేసిన తాలిబాన్లు.. విడుదల చేసినా ఇంకా ఎయిర్‌పోర్టు బయటే ఉండాల్సి వస్తుంది. వీళ్ల నిబంధనల వల్ల మూడు రోజులుగా రోడ్ మీదే తిండీతిప్పలు లేకుండా.. పిల్లలకు పాలు, నీళ్లు లేకుండా ఉండాల్సి వస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ ను ఇదే అడుగుతున్నా.. వారిని సేఫ్ గా తిరిగి చేర్చాలని కోరుతున్నా’ అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.