డెంటిస్ట్‌తో ఇక పనిలేదు : సైంటిస్టులు కనిపెట్టిన కొత్త జెల్.. 48 గంటల్లో మీ పళ్లు క్యూర్
మీ పళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా? పళ్లలో ఏమైనా క్యావిటీలు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయా? తరచూ పళ్లు పుచ్చిపోవడం, పళ్లపై ఎనామిల్ పూత దెబ్బతినడం వంటి సమస్యలు ఉన్నాయా?

మీ పళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా? పళ్లలో ఏమైనా క్యావిటీలు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయా? తరచూ పళ్లు పుచ్చిపోవడం, పళ్లపై ఎనామిల్ పూత దెబ్బతినడం వంటి సమస్యలు ఉన్నాయా?
మీ పళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా? పళ్లలో ఏమైనా క్యావిటీలు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయా? తరచూ పళ్లు పుచ్చిపోవడం, పళ్లపై ఎనామిల్ పూత దెబ్బతినడం వంటి సమస్యలు ఉన్నాయా? అయితే మీరు దంత వైద్యుడికి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. సొంతంగా పళ్లు రిపేర్ చేసుకోవచ్చు. చైనా రీసెర్చర్లు పళ్ల ఆరోగ్యానికి సంబంధించి ఓ స్పెషల్ జెల్ కనిపెట్టారు. పళ్లకు రక్షణగా కప్పి ఉండే గట్టి పొర ఎనామిల్ (పింగాణీ పూత)ను రిపేర్ చేసేందుకు జియాంగ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు స్పెషల్ జెల్ రూపొందించారు.
దెబ్బతిన్న పళ్లపై ఈ జెల్ అప్లయ్ చేస్తే చాలు.. 48 గంటల్లో మీ పళ్లు క్యూర్ అవుతాయి. కొన్నిసార్లు పళ్లపై ఒత్తిడి పడటం లేదా బ్రష్ తో అదే పనిగా గట్టిగా తోమడం, బరుసైన వస్తువులతో పళ్లను రుద్దడం వంటివి చాలామంది చేస్తుంటారు. ఇలా చేస్తే పళ్లు పచ్చరంగు నుంచి తెలుపు రంగులోకి మారతాయని భావిస్తుంటారు. దీనివల్ల పళ్లపై రక్షణగా ఉండే ఎనామిల్ పూత దెబ్బతింటుంది. ఫలితంగా పళ్లు పుచ్చిపోవడం పలు రకాల సమస్యలు తలెత్తుతాయి.
పళ్ల మధ్య సందులు ఏర్పడటం, తిన్న ఆహారం వాటిలో చిక్కుకోవడం కారణంగా క్యావిటీలు, తొర్రలు ఏర్పడతాయి. కొన్నాళ్లకు ఈ సమస్య మరింత తీవ్రమై పళ్లు పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. పళ్ల సమస్యను తగ్గించేందుకు రుయికాంగ్ టాంగ్ సహా ఇతర రీసెర్చర్లు ప్రత్యామ్నాయ మెటేరియల్ కోసం పరిశోధనలు చేశారు. పరిశోధనల్లో వారికి పరిష్కారం దొరికింది. క్యాల్షియం, పాస్పేట్ జెల్ ను పళ్లకు అప్లయ్ చేయడమే సరైన పరిష్కారమని గుర్తించారు. ఈ జెల్ అప్లయ్ చేయడం ద్వారా పళ్లు సెల్ఫ్ రిపేర్ అవుతాయి. రెగ్యులర్ ఎనామిల్ మాదిరిగానే క్యాలిషయం పాస్పెట్ క్రిస్టల్స్ తయారవుతాయిని సైంటిస్టులు నిర్ధారించారు. జెల్ నుంచి కొత్త ఎనామిల్ 3 మైక్రో మీటర్ల మందంగా మాత్రమే తయారైనట్టు గుర్తించారు.
దెబ్బతినని ఎనామిల్ పూత కంటే 400 రెట్లు పల్చని పూతలా ఉంటుంది. ఎన్ని లేయర్లు కావాలంటే అన్నిసార్లు జెల్ అప్లయ్ చేసుకోవచ్చునని టాంగ్ తెలిపారు. కొందరి దాతల నుంచి ఒక్కో పంటిని తొలగించి తొలుత టెస్టింగ్ జరిపారు. ప్రస్తుతం.. కనిపెట్టిన స్పెషల్ జెల్‌ను ఎలుకలపై పరీక్షిస్తున్నారు. వచ్చిన ఫలితాల్ని బట్టి మనుషులపై కూడా టెస్టింగ్ చేయాలని భావిస్తున్నారు. జెల్ పూసిన పళ్లతో ఆహారం తినడం, తాగడం వంటి పనులు చేయడం ఎంత వరకు సురక్షితం అనే విషయంలో సైంటిస్టులు నిర్ధారించాల్సి ఉంది. అన్ని అనుకున్నట్టుగా సక్సెస్ అయితే.. దంత సమస్యలతో బాధపడేవారికి జెల్ అద్భుత ఔషధంగా మారుతుంది అనడంలో సందేహం లేదు.