Imran Khan
Imran Khan : పాక్ పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగనుంది. పాకిస్థాన్ సుప్రీంకోర్టు నిర్ణయంతో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ భావోద్వేగ ప్రసంగం చేశారు. భారత్ పై ప్రశంసలు కురిపించారు. భారత్ విదేశాంగ విధానం బాగుందని, భారత్ ను ఏ సూపర్ పవర్ శాసించలేదన్నారు. భారతదేశం గురించి ఇతరులకంటే తనకే ఎక్కువ తెలుసని, క్రికెటర్ వల్ల తనకు భారత్ తో స్నేహబంధం ఏర్పడిందని గుర్తు చేశారు.
Read More : Pakistan : ఇమ్రాన్ ఖాన్ కు మరో ట్విస్టు- దేశం విడిచి పారిపోయిన భార్య ఫ్రెండ్
ఇండియాలో ప్రేమ, అప్యాయతతో పాటు గౌరవం దక్కిందని, కానీ సొంత దేశంలో ప్రతిపక్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ కు అంతర్జాతీయంగా బెదిరింపులు వస్తున్నట్లు వెల్లడించిన ఆయన అమెరికా దేశంపై ఆరోపణలు గుప్పించారు. అమెరికా తనను తోలుబొమ్మను చేయాలని చూసిందని, రష్యాలో పర్యటించడం అమెరికాకు ఇష్టం లేదన్నారు.
ప్రస్తుతం పాకిస్తాన్ లో జాతీయ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకుని ప్రభుత్వాన్ని రద్దు చేసిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..ఆమేరకు దేశంలో ముందస్తుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్..జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి సూచించారు. ఇదిలాఉంటే..అవిశ్వాసాన్ని తప్పించి ముందస్తు ప్రకటన చేసిన పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఆదేశ సుప్రీం కోర్టు మాజీ ప్రధాని గుల్జార్ అహ్మద్ ను ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇమ్రాన్ ఖాన్.