Chinese Criticising Jinping: జిన్‭పింగ్‭కు నిరసన సెగ.. దేశద్రోహి, నియంతను ఓడించాలంటూ బ్యానర్లు.. చైనాలో కొత్త ఒరవడి

ప్రపంచం కూడా చైనీయులు ఏదో మాట్లాడతారు, చెబుతారు అనే అభిప్రాయాన్ని కూడా ఎప్పుడో వదిలేసింది. కానీ, అనూహ్యంగా ఎప్పటి నుంచో తమ కడుపులోనే దాచుకున్న అసంతృప్తిని, అసహనాన్ని చైనీయులు.. నిర్బంధపు సంకెళ్లను చేధించి బయట పెట్టారు. ఏకంగా అధ్యక్షుడు జిన్‭పింగ్‭కు వ్యతిరేకంగా నాలుగు రోడ్ల కూడలిలో బ్యానర్లు కట్టేశారు. ‘‘సమ్మె చేయండి, నియంత, దేశ ద్రోహి జీ జిన్‌పింగ్‌ను తొలగించండి’’ అంటూ ఆ బ్యానర్లలో రాసుకొచ్చారు

'No to great leader, yes to vote': Rare protest banner hung up in Beijing criticising Communist leadership

Chinese Criticising Jinping: చైనాకు సంబంధించి ఎప్పుడూ వింతలు, విశేషాలు, అద్భుతాలు లాంటి వార్తలే తరుచూ వింటుంటాం. కానీ ప్రజలు, హక్కులు, నిరసనలు లాంటివి మచ్చుకైనా కనిపించవు. కారణం.. అక్కడి ప్రభుత్వం, ప్రభుత్వ విధానం. ఎన్నికలు లేని ప్రజాస్వామ్యం లేని దేశం. దేశంలో ఒకే పార్టీ, ఒకే ప్రభుత్వం ఉంటుంది. దేశాధినేతను కూడా ప్రజలు కాకుండా పార్టీయే ఎన్నుకుంటుంది. అందుకే ఆ దేశంలో ప్రభుత్వ వ్యతిరేకతలు, నిరసనలు లాంటివి కనిపించవు. పైగా ప్రజా మీడియా ఉండదు. ప్రభుత్వం నుంచి అనేక ఆంక్షలు. ప్రభుత్వం ఏదైతే చెప్పాలనుకుందో అది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుస్తుంది. అంతే కానీ, చైనీయుల మనోభావాలు, అభిప్రాయాలు, కష్టాలు ప్రజలకు కనిపించవు.

ప్రపంచం కూడా చైనీయులు ఏదో మాట్లాడతారు, చెబుతారు అనే అభిప్రాయాన్ని కూడా ఎప్పుడో వదిలేసింది. కానీ, అనూహ్యంగా ఎప్పటి నుంచో తమ కడుపులోనే దాచుకున్న అసంతృప్తిని, అసహనాన్ని చైనీయులు.. నిర్బంధపు సంకెళ్లను చేధించి బయట పెట్టారు. ఏకంగా అధ్యక్షుడు జిన్‭పింగ్‭కు వ్యతిరేకంగా నాలుగు రోడ్ల కూడలిలో బ్యానర్లు కట్టేశారు. ‘‘సమ్మె చేయండి, నియంత, దేశ ద్రోహి జీ జిన్‌పింగ్‌ను తొలగించండి’’ అంటూ ఆ బ్యానర్లలో రాసుకొచ్చారు. తమకు స్వేచ్ఛ కావాలని, పౌరులుగా జీవించాలని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే చైనీయుల్లో ప్రజాస్వామ్య కాంక్ష పెరుగుతున్నట్లే కనిపిస్తోంది.

Biden 50% Discount At Restaurant : రెస్టారెంట్ కు వెళ్లి చికెన్‌ ఆర్డర్ చేసిన జో బైడెన్ .. 50 శాతం డిస్కౌంట్ ఇచ్చిన క్యాషియర్‌

రెండుసార్లు చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‭పింగ్‭.. మరికొద్ది రోజుల్లోనే మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు గర్తు తెలియని వ్యక్తులు ఈ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఒక బ్యానర్లో ‘‘కోవిడ్ పరీక్ష వద్దు, ఆహారం కావాలి. అష్టదిగ్బంధనం వద్దు, స్వేచ్ఛ కావాలి. అబద్ధాలు వద్దు, గౌరవ, మర్యాదలు కావాలి. సాంస్కృతిక విప్లవం వద్దు, సంస్కరణలు కావాలి. మహా నేత అక్కర్లేదు, ఎన్నికలు జరగాలి. బానిసగా ఉండకండి, పౌరునిగా జీవించండి’’ అని రాసుకొచ్చారు. మరొక బ్యానర్లో ‘‘సమ్మె చేయండి, నియంత, దేశ ద్రోహి జీ జిన్‌పింగ్‌ను తొలగించండి’’ అని రాసుకొచ్చారు.

ఈ రెండు బ్యానర్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలను చైనా అధికారులు ఖండించడం విశేషం. అటువంటి బ్యానర్లేవీ చైనాలో ఏర్పాటు చేయలేదని చైనా పోలీసులు తెలిపారు. నిజానికి ఈ వార్తలు చైనీయుల సోషల్ మీడియా ఖాతాల్లోనే కనిపించాయి. అనంతరం చైనీస్ మాధ్యమాల నుంచి అవి కనుమరుగవ్వడం కొసమెరుపు. ఇక సోషల్ మీడియాకెక్కాక పాశ్చాత్య దేశాలు ఊరుకుంటాయా…? చైనాలో ప్రజా విప్లవం లేచిందంటూ ప్రచారం చేస్తున్నారు.

Rahul Gandhi: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ డుమ్మా!