North Korea: ఉత్తరకొరియాలో కరోనా వైరస్ స్వైరవిహారం.. వణికిపోతున్న కిమ్ జోంగ్-ఉన్ అడ్డా..

ప్రపంచాన్ని గడగడలాడించే ఉత్తరకొరియా ప్రభుత్వాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌‌ను కరోనా వణికిస్తోంది. రెండేళ్లుగా కరోనా ఆనవాళ్లు లేకుండా ఉత్తరకొరియాను ప్రజలు జీవనం సాగించారు. ప్రపంచం మొత్తం కరోనాతో కాకావికలం అవుతున్నా.. ఉత్తరకొరియాలో ...

North Korea: ప్రపంచాన్ని గడగడలాడించే ఉత్తరకొరియా ప్రభుత్వాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌‌ను కరోనా వణికిస్తోంది. రెండేళ్లుగా కరోనా ఆనవాళ్లు లేకుండా ఉత్తరకొరియాను ప్రజలు జీవనం సాగించారు. ప్రపంచం మొత్తం కరోనాతో కాకావికలం అవుతున్నా.. ఉత్తరకొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.. కానీ ఇప్పుడు కరోనా వైరస్ వివిధ వేరియంట్ల రూపంలో ఉత్తరకొరియాపై గట్టి ఫోకస్ పెట్టి స్వైరవిహారం చేస్తోంది. కొవిడ్‌ను అడ్డుకొనేందుకు కిమ్ జోంగ్ ఉన్ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతుండటంతో ఆ దేశంలో భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మూడు రోజుల్లోనే ఆ దేశంలో 8,20,620 కేసులు నమోదు కావటం ఆ దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కొవిడ్ వైరస్ వ్యాప్తిని ఉత్తర కొరియా అంగీకరించిన దాదాపు మూడు రోజుల తరువాత దేశంలో 15 మంది మరణించారు. శనివారం మొత్తం మరణాల సంఖ్య 42కి చేరుకుంది.

North Korea Lock Down : ఉత్తరకొరియాలో కఠిన లాక్‌‌డౌన్.. కిమ్ అడ్డాలో తొలి కరోనా కేసు..!

ఆ దేశ మీడియా నివేదికల ప్రకారం.. ఉత్తర కొరియాలో గత మూడు రోజుల్లో 8,20,620 కేసులు నమోదయ్యాయి. ఉత్తర కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2,96,180 ప్రాణాంతక వైరస్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ప్యోంగ్యాంగ్ లో తీవ్ర జ్వరాలతో బాధపడుతున్న అనేక మంది వ్యక్తులను COVID-19 వైరస్ కోసం పరీక్షించిన తర్వాత వ్యాప్తి తీవ్రంగా ఉందని అర్థమవుతుంది. వైరస్ సోకిన వారు ప్రాణాంతకమైన ఓమిక్రాన్ వేరియంట్‌తో బాధపడుతున్నారని ప్యోంగ్యాంగ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇలానే పరిస్థితి ఉంటే మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

North korea Missile : వరుస మిస్సైల్ ప్రయోగాలతో కవ్విస్తున్న కిమ్..ఆందోళనలో దక్షిణకొరియా

మరోవైపు నార్త్ కోరియా ప్రభుత్వం మాత్రం వైరస్ వ్యాప్తి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతోంది. దాదాపు 12 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తల్ని రంగంలోకి దింపి వైద్యసేవలు అందిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ప్రజల్లో వైరస్ పై అవగాహన లేకపోవడమే వైరస్ వ్యాప్తి పెరగడానికి కారణమని, ఆ మేరకు ప్రజల్లో వైరస్ పై అవగాహన కల్పిస్తున్నామని అక్కడి ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కిమ్ ఉన్ జోన్ ఆ దేశంలో కఠిన లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. భారీ స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులో ఉంచారు. మరోవైపు ఉత్తర కొరియాకు వ్యాక్సిన్లు సహా మహమ్మారి అదుపునకు కావాల్సిన ఇతర సాయాన్ని అందించడానికి చైనా, దక్షిణ కొరియా ముందుకు వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు కిమ్‌ సర్కార్‌ మాత్రం వాటిని అంగీకరించడానికి అధికారికంగా ముందుకురాలేదు.

ట్రెండింగ్ వార్తలు