North Korea : కిమ్ కవ్వింపులు .. రెండు వారాల్లో ఆరు క్షిపణుల ప్రయోగం
ఆంక్షలను భేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా మరోసారి రెండు క్షిపణులను పరీక్షించింది. వీటితో రెండు వారాల్లో ఉత్తరకొరియా ఆరు క్షిపణుల ప్రయోగాలు చేసింది. కిమ్ కవ్వింపు చర్యలతో జపాన్, అమెరికాలో తీవ్రంగా మండిపడుతున్నాయి.

North Korea carries out sixth missile launch in two weeks
North Korea missile launch : ఎవరు ఎన్ని అనుకున్నా..ఎన్ని నిబంధనలు ఉన్నా నేనేం చేయాలనుకుంటానో అదే చేసి తీరుతాను అనే కిమ్ మరోసారి తానేంటో చేసి చూపించారు. ఆంక్షలను భేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా మరోసారి రెండు క్షిపణులను పరీక్షించింది. వీటితో రెండు వారాల్లో ఉత్తరకొరియా ఆరు క్షిపణుల ప్రయోగాలు చేసింది. వరుస క్షిపణుల ప్రయోగాలతో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి కవ్వింపు చర్యలకు పూనుకున్నారు. ఆంక్షలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా క్షిపణులను పరీక్షిస్తున్న ఉత్తర కొరియా గురువారం (అక్టోబర్ 6,2022) మరో రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను పరీక్షించింది. గత రెండు వారాల్లో ఇది ఆరో పరీక్ష కావడం గమనించాల్సిన విషయం. ఉత్తర కొరియా క్షిపణులను పరీక్షించచటంతో దక్షిణ కొరియా అప్రమత్తమైంది. దక్షిణకొరియా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఉత్తరకొరియా కవ్వింపు చర్యలకు ధీటుగా ప్రతిస్పందన ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
మంగళవారం కూడా జపాన్ ప్యోంగ్యాంగ్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణిని పరీక్షించింది. ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఉత్తర కొరియా చర్యలకు రష్యా, చైనా నుంచి లభిస్తున్న రక్షణ సహకారమే కారణమని అమెరికా ఈ సమావేశంలో ఆరోపించింది.
మరోవైపు..తమ దేశం మీదుగా క్షిపణిని పరీక్షించడాన్ని తీవ్రంగా పరిగణించిన జపాన్, దక్షిణ కొరియాలు బుధవారం యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. ఈ విన్యాసాలను అమెరికా కూడా సమర్థించింది. తమ నౌకాదళ ఆయుధాలను కొరియా ద్వీపకల్పానికి తరలించింది. యూఎస్ యుద్ధనౌక రోనాల్డ్ రీగన్ ను కొరియా ద్వీపకల్పానికి సమీపంలో మోహరించింది. ఈ సందర్భంగా దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్స్ స్పందిస్తూ.. ఉత్తర కొరియా నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా నిర్ణయాత్మక శక్తితో ఎదుర్కొంటామని స్పష్టం చేసింది.