Ukraine war : యుక్రెయిన్ యుద్ధం కోసం రష్యాకు ఉత్తర కొరియా 1000 కంటైనర్లలో ఆయుధాలు…రహస్యంగా రైళ్లలో తరలింపు, ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో వెల్లడి

యుక్రెయిన్ దేశంతో యుద్ధం కోసం రష్యాకు ఉత్తర కొరియా బాసటగా నిలిచింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా దేశంలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఇటీవల కలిసిన తర్వాత సైనిక పరికరాలు, ఆయుధాలు పంపించారు.....

North Korea military equipment

Ukraine war : యుక్రెయిన్ దేశంతో యుద్ధం కోసం రష్యాకు ఉత్తర కొరియా బాసటగా నిలిచింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా దేశంలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఇటీవల కలిసిన తర్వాత సైనిక పరికరాలు, ఆయుధాలు పంపించారు. యుక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం కోసం రష్యాకు 1,000 కంటే ఎక్కువ సైనిక పరికరాలు, ఆయుధాల కంటైనర్‌లను ఉత్తర కొరియా పంపించింది. రష్యా అధునాతన ఆయుధ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్తర కొరియా దేశం నుంచి కోరుతున్నట్లు అమెరికా విశ్వసిస్తోందని వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ శుక్రవారం తెలిపారు.

రైలు కంటైనర్లలో ఆయుధాల తరలింపు

యుక్రెయిన్ యుద్ధం కోసం రష్యాకు మందుగుండు సామాగ్రిని కొత్తర కొరియా అందించింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుక్రెయిన్ యుద్ధంలో రష్యా వద్ద ఉన్న మందుగుండు సామాగ్రి నిల్వలు హరించిన నేపథ్యంలో ఉత్తర కొరియా ఆయుధాలు, సైనిక పరికరాలను పంపించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఉత్తర కొరియా నుంచి ఆయుధాలకు బదులుగా రష్యా అధునాతన ఆయుధ సాంకేతిక పరిజ్ఞానాన్ని కోరుతున్నట్లు యూఎస్ విశ్వసిస్తున్నట్లు జాన్ కిర్బీ పేర్కొన్నారు. నైరుతి రష్యాకు రైలు ద్వారా తరలించే కంటైనర్లను రష్యా జెండాతో కూడిన ఓడలో లోడ్ చేసినట్లు చూపించే చిత్రాలను వైట్ హౌస్ తాజాగా విడుదల చేసింది.

యూఎస్ విమాన వాహక నౌక యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్ రాక

కంటైనర్లు సెప్టెంబర్ 7 అక్టోబర్ 1వతేదీల మధ్య ఉత్తర కొరియాలోని నాజిన్- రష్యాలోని డునే నగరాల మధ్య రవాణా చేసినట్లు వైట్ హౌస్ తెలిపింది. దక్షిణ కొరియాలో యూఎస్ విమాన వాహక నౌక రాకపై ఉత్తర కొరియా అణు దాడిని పెంచింది. యూఎస్ అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్ 2023 అక్టోబర్ 12వతేదీన దక్షిణ కొరియాలోని బుసాన్‌కు చేరుకుంది. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ నేపథ్యంలో అమెరికా విమాన వాహక నౌక దక్షిణ కొరియాకు చేరుకుంది.

వైట్‌హౌస్‌కు అందిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు

ఉత్తర కొరియా యుద్ధ సామాగ్రిని రష్యాకు సరఫరా చేస్తుందని ఇటీవల వెలుగుచూసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు తేటతెల్లం చేశాయి. ప్యోంగ్యాంగ్ నుంచి యుద్ధ విమానాలు, ఉపరితలం నుంచి గగనతలానికి సంబంధించిన క్షిపణులు, సాయుధ వాహనాలు, బాలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి పరికరాలు, ఇతర అధునాతన సాంకేతికతలతో సహా సైనిక సహాయాన్ని రష్యా కోరుతున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. దక్షిణ కొరియాకు యూఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధ బృందం రాకపై ఉత్తర కొరియా శుక్రవారం విరుచుకుపడింది. దీంతో యూఎస్ ఇంటెలిజెన్స్ సేకరించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసింది.

Also Read :Benjamin Netanyahu: మూడు పెళ్లిల్లు, సైన్యంలో అన్న చనిపోయాక కసితో రాజకీయాల్లోకి.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తికర జర్నీ తెలుసుకోండి

తనను తాను రక్షించుకోవడానికి అణ్వాయుధాలను ఉపయోగించడం గురించి మళ్లీ చర్చ సాగుతోంది. ఉత్తర కొరియా గతంలో రష్యాకు మందుగుండు సామాగ్రి, ఫిరంగి గుండ్లు, రాకెట్లు అందించిందని అమెరికా ఆరోపించింది. మాస్కోకు ఆయుధాలను అందించారనే విషయాన్ని ఉత్తర కొరియా గతంలో ఖండించింది. ఉత్తర కొరియా-రష్యా సరిహద్దులో రైలు ట్రాఫిక్‌లో గణనీయమైన పెరుగుదలను చూపించే ఉపగ్రహ ఫోటోలను సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్, వాషింగ్టన్ థింక్ ట్యాంక్, గత వారం ప్రచురించింది. తమంగాంగ్ వద్ద రైళ్లలో రష్యాకు ఆయుధాలను రవాణ చేశారనే విషయం తాజాగా వెల్లడైంది.

Also Read :Revanth Reddy : సిగ్గుండాలి.. పార్టీని దెబ్బతీసేందుకే రాజీనామా- పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ రెడ్డి ఫైర్

ట్రెండింగ్ వార్తలు