North Korea Kim : దక్షిణ కొరియా సినిమాలు చూసినందుకు..ఉత్తర కొరియాలో ఇద్దరు స్కూల్ విద్యార్ధులకు మరణశిక్ష

దక్షిణ కొరియా సినిమాలు చూసినందుకు..ఉత్తర కొరియాలో ఇద్దరు స్కూల్ విద్యార్ధులకు మరణశిక్ష విధించారు అధికారులు. కిమ్ రాక్షసత్వపు నిర్ణయాలకు ఇద్దరు విద్యార్ధులు బలైపోయారు. ఆ ఇద్దరు విద్యార్ధులను వైమానిక క్షేత్రం వద్ద బహిరంగంగా కాల్చి చంపారు. వారికి శిక్ష విధించటం అందరూ చూడాలని బలవంతంగా అందరూ తప్పనిసరిగా చూడాలని అధికారులు స్థానికులను బలవంతంగా వైమానిక క్షేత్రం వద్దకు తరలించారు. మీరుకూడా ఇటువంటి పనులు చేస్తే మీకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

North Korea Kim : ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం రాక్షసత్వానికి ఇద్దరు స్కూల్ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు బాలురు సినిమా చూసినందుకు అత్యంత కర్కత్వంగా దేశద్రోహులు అన్నట్లుగా కాల్చి చంపిన ఘటన కిమ్ రాక్షసత్వానికి పరాకాష్టగా కనిపిస్తోంది. దక్షిణ కొరియా సినిమాలు చూసిన పాపానికి ఉత్తర కొరియాలో ఇద్దరు హైస్కూల్ విద్యార్ధులకు మరణశిక్ష అమలు చేసింది కిమ్ ప్రభుత్వం.దేశంలో ప్రజలు ఎలా ఉండాలో.. ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేయించుకోవాలో..ఎటువంటి దుస్తులు ధరించాలో..ఎటువంటి సినిమాలు చూడాలో కూడా నిర్ణయించే నియంత కిమ్ రాక్షసత్వానికి ముక్కుపచ్చలారని ఇద్దరు విద్యార్ధులు బలైపోయారు. దక్షిణకొరియాకు చెందిన సినిమాలు చూశారని బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారు ఉత్తరకొరియా అధికారులు.

Kim Jong-un : కిమ్ మరో వింత నిర్ణయం : పిల్లలకు బాంబు, తుపాకీ, ఉపగ్రహం అని పేరు పెట్టాలని ఆదేశం

ఉత్తర కొరియాలోని ర్యాన్ గాంగ్ ప్రావిన్స్ కు చెందిన ఇద్దరు హైస్కూలు విద్యార్థులు (16,17 సంవత్సరాలు) దక్షిణ కొరియా కే-డ్రామాస్ (వెబ్ సిరీస్ లు), సినిమాలు, అమెరికా టీవీ షోలు చూశారు. వాటినిక షేర్ చేయడం, కొందరికి విక్రయించడం చేశారని అధికారులు అభియోగాలు మోపారు. ఆ ఇద్దరు విద్యార్ధులను బహిరంగంగా కాల్చి చంపారు.

ఉత్తర కొరియా నియంత కిమ్ ఆదేశాల మేరకు అత్యంత రాక్షసత్వపు ఆంక్షలు ఉంటాయి దేశంలో. వాటిని అతిక్రమిస్తే పిల్లలు అనిగానీ,మహిళలు అనిగాని చూడకుండా క్రూరంగా శిక్షించటం ఉత్తరకొరియాకు మాత్రమే చెల్లింది. ఉత్తరకొరియాలో కిమ్ చట్ట ప్రకారం దక్షిణ కొరియా కే-డ్రామాస్ (వెబ్ సిరీస్ లు), సినిమాలు, అమెరికా టీవీ షోలు చూడటం నేరం.వీటిపై కిమ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈక్రమంలో సదరు స్కూల్ విద్యార్ధులు వాటిని చూడడమే కాకుండా..ఇతరులు కూడాషేర్ చేశారని అంటే వారిని కూడా చూడాలని ప్రోత్సహించటమేనని నిర్ధారించిన అధికారులు ఆ ఇద్దరికి మరణశిక్ష విధించారు.

North Korea : The Uncle సినిమా చూసినందుకు బాలుడికి 14 ఏళ్లు జైలుశిక్ష వేసిన ఉత్తర కొరియా ప్రభుత్వం

ఆ ఇద్దరు మైనర్ల (హైస్కూల్ విద్యార్ధులు)ను ఓ వైమానిక క్షేత్రం వద్ద బహిరంగంగా కాల్చి చంపారు. కిమ్ జాంగ్ ఉన్ పాలనలో టీనేజర్లు ఇలాంటి చర్యలకు పాల్పడడాన్ని ‘దుష్ట కార్యకలాపాలు’గా పరిగణిస్తారు. పైగా మరో రాక్షసత్వం ఏమిటంటే…ఇటువంటివి మీరు చేసినా ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తూ వారిద్దరిని కాల్చి చంపేసమయంలో అందరూ తప్పనిసరిగా చూడాలని అధికారులు స్థానికులను బలవంతంగా వైమానిక క్షేత్రం వద్దకు తరలించారు. ఇటువంటి రాక్షస కార్యాలు ఉత్తరకొరియాలో సర్వసాధారణమే.

Laughing Banned in NorthKorea :దటీజ్ కిమ్..ఉత్తరకొరియాలో ప్రజలు నవ్వొద్దు, తాగొద్దు,వేడుకలు చేసుకోవద్దు..

కాగా ఇటీవల కిమ్ నియంతృత్వానికి నిదర్శనంగా ఓ వింత నిర్ణయం కూడా తీసుకున్నారు. ఉత్తరకొరియాలో ప్రజలు తమ పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలో కూడా ఆదేశాలు జారీ చేశారు కిమ్. పిల్లలకు బాంబ్, గన్, శాటిలైట్ అని పేర్లు పెట్టాలని ఆదేశాలు ఇచ్చిపారేశారు. గన్‌లపై తనకు ఉన్న అతి ప్రేమను దేశ ప్రజలపై రుద్దే ఆదేశాలు జారీ చేశారు కిమ్.తల్లిదండ్రులు తమ పిల్లలకు బాంబ్‌, గన్‌, శాటిలైట్‌ (ఉపగ్రహం) ఇలా దేశభక్తి అర్థం వచ్చే పేర్లను పెట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని యథావిధిగా హెచ్చరించారు.

Read more : Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

Read more : Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

ట్రెండింగ్ వార్తలు