North Korea: పువ్వులు పూయించలేదని తోటమాలీలను జైల్లో పెట్టిన కిమ్

తన తండ్రి జన్మదినం సందర్భంగా.. అలంకరణ కోసం ఉపయోగించే పువ్వులు పూయించలేదంటూ.. తోటమాలీలను అరెస్ట్ చేసి కార్మిక శిభిరానికి తరలించాడు కిమ్

North Korea: ఉత్తర కొరియా నియంత “కిమ్ జోంగ్ ఉన్” గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటవినని వారిని, చిన్న చిన్న పొరబాటులకే ప్రజలను శిక్షిస్తూ..వార్తల్లో నిలుస్తుంటాడు కిమ్. అటువంటి మరో సంఘటనతో తాజాగా వార్తల్లో నిలిచాడు కిమ్ జోంగ్ ఉన్. తన తండ్రి జన్మదినం సందర్భంగా.. అలంకరణ కోసం ఉపయోగించే పువ్వులు పూయించలేదంటూ.. తోటమాలీలను అరెస్ట్ చేసి కార్మిక శిభిరానికి తరలించాడు కిమ్. తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కు నివాళి అర్పించేందుకు ఆ పువ్వులకు తన తండ్రి పేరునే పెట్టాడు కిమ్. ఫిబ్రవరి 16న కిమ్ జోంగ్ ఇల్ జన్మదినం సందర్భంగా.. ఆయన సమాధి ప్రాంతంలో..రహదారి పొడువునా.. ఎర్రటి పుష్పాలు పూచేలా ప్రతి ఏడాది మొక్కలను ఏర్పాటు చేస్తారు.

Also read: Gold Smuggling: రూ.1473కోట్ల విలువైన 4,522 కేజీల బంగారాన్ని తరలించిన స్మగ్లర్ అరెస్ట్

కింజోంగిలియాగా పిలిచే ఈ పుష్పాలు సమశీతోష్ణస్థితి వాతావరణంలో మాత్రమే పెరుగుతాయి. ఉత్తరకొరియా, చైనాలో విరివిగా పూచే ఈ పూలు.. దక్షిణాసియాలో కనిపించే మందారం జాతికి చెందినవిగా పేర్కొంటారు. అయితే ఇటీవల ఉత్తర కొరియాలో విపరీతమైన మంచు కురిసింది. దీంతో మొక్కలను పెంచేందుకు సరైన వాతావరణం లేక తోటమాలీలు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈపుష్పాలు పూచేలా గ్రీన్ హౌస్ బాయిలర్లను ఉపయోగిస్తారు. అయితే మంచు కారణంగా వంటచెరకు లభించక.. ఈ ఏడాది బాయిలర్లు పనిచేయలేదు. దీంతో బాయిలర్ ను నిర్వహిస్తున్న యజమానికి మూడు నెలలు.. తోటమాలికి ఆరు నెలల పాటు కఠిన జైలు శిక్ష విధించాడు కిమ్. ప్రస్తుత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ అంటే ఉత్తర కొరియాలో దైవంగా కొలుస్తారు.

Also read: Ukraine Crisis: మరో నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ పై దాడి జరగబోతుంది: జో బైడెన్

ట్రెండింగ్ వార్తలు