Ukraine Crisis: మరో నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ పై దాడి జరగబోతుంది: జో బైడెన్

ఫిబ్రవరి 16న రష్యా.. ఉక్రెయిన్ పై దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూరోపియన్ మిత్రపక్షాలను హెచ్చరించారు

Ukraine Crisis: మరో నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ పై దాడి జరగబోతుంది: జో బైడెన్

Russia

Ukraine Crisis: రష్యా – ఉక్రెయిన్ మధ్య సంక్షోభం మరింత ముదిరింది. ఉక్రెయిన్ పై దాడులకు తెగబడతామంటూ రష్యా హెచ్చరిస్తుండగా..అదేగనుక జరిగితే నాటో దళాలతో కలిసి రష్యాపై యుద్ధానికి దిగుతామని అమెరికా ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 16న రష్యా.. ఉక్రెయిన్ పై దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూరోపియన్ మిత్రపక్షాలను హెచ్చరించారు. యూరోపియన్ మిత్రపక్షాలు, నాటో సభ్య దేశాలతో శనివారం జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. యూకే, జర్మనీ, ఇటలీ, కెనడా, పోలాండ్, రొమేనియా మరియు ఫ్రాన్స్ దేశాధినేతలు సహా, NATO సెక్రటరీ జనరల్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Also read: Buses for Sale: రూ.45 కేజీకి లగ్జరీ బస్సులను స్క్రాప్‌లో అమ్మకానికి పెట్టిన ట్రావెల్స్ యజమాని

ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ తమ నిఘావర్గాల సమాచారం ప్రకారం రష్యా మరో నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ పై దాడికి పాల్పడుతుందని పేర్కొన్నారు. ముందుగా మిస్సైల్ దాడులకు పాల్పడి అనంతరం సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘావర్గాలు తనను హెచ్చరించినట్లు బైడెన్ తెలిపారు. దాదాపుగా సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని ఆయా దేశాధినేతలు భావిస్తుండగా..యూకే ప్రతినిధులు మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.

Also read: Tejas Aircraft: “సింగపూర్ ఎయిర్ షో-2022″లో తేజస్ యుద్ధ విమానాల ప్రదర్శన

యూరోపియన్ యూనియన్ కు చెందిన మరో ఇద్దరు లీడర్లు సైతం దాడులపై తమ స్వరాన్ని వినిపించారు. “దాడుల సమాచారం నమ్మశక్యంగా లేదని, యుద్ధం విలువ పుతిన్ కి తెలుసు కాబట్టి.. అంత పని చేస్తారని తాము భావించడం లేదని” వారు పేర్కొన్నారు. ఒక వేళ దాడి జరిగితే ఉక్రెయిన్ సర్వశక్తులొడ్డుతు ఎదుర్కొంటుందని సదరు నేతలు పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఉక్రెయిన్ పై “వైమానిక బాంబు దాడులు మరియు క్షిపణి దాడులు” జరిగే అవకాశం ఉందని, అది ప్రస్తుత ఒలింపిక్స్ సమయంలోనా, ఒలింపిక్స్ తరువాతనా అనేది తెలియదని US జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ పేర్కొన్నారు.

Also read: Covid Vaccine: శాస్త్రవేత్తల సిఫార్సు ఉంటేనే 5-15 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్: కేంద్ర మంత్రి