Tejas Aircraft: “సింగపూర్ ఎయిర్ షో-2022″లో తేజస్ యుద్ధ విమానాల ప్రదర్శన

ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు "సింగపూర్ ఎయిర్ షో-2022" జరుగుతుందని, అందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాన్ని ప్రదర్శన

Tejas Aircraft: “సింగపూర్ ఎయిర్ షో-2022″లో తేజస్ యుద్ధ విమానాల ప్రదర్శన

Tejas

Tejas Aircraft: క్షిపణులు, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా దూసుకుపోతున్న భారత రక్షణశాఖ..ఆమేరకు అందివచ్చే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. దేశ విదేశాల్లో రక్షణ ఉత్పత్తులను ప్రదర్శించి..ఆర్డర్స్ పొందేందుకు రక్షణశాఖ ప్రయత్నిస్తుంది. గతేడాది నవంబర్ లో దుబాయ్ వేదికగా నిర్వహించిన ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానాన్ని ప్రదర్శనకు ఉంచగా..వివిధ దేశాల రక్షణశాఖలను ఆకట్టుకుంది. ఇక తాజాగా సింగపూర్ వేదికగా నిర్వహించనున్న “సింగపూర్ ఎయిర్ షో-2022″లోనూ తేజస్ యుద్ధ విమానాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈమేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 44 మంది సభ్యుల బృందం ఇప్పటికే సింగపూర్ చేరుకున్నట్లు సమాచారం.

Also read: Covid Vaccine: శాస్త్రవేత్తల సిఫార్సు ఉంటేనే 5-15 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్: కేంద్ర మంత్రి

ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు “సింగపూర్ ఎయిర్ షో-2022” జరుగుతుందని, అందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాన్ని ప్రదర్శిస్తున్నట్లు భారత రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ తక్కువ-స్థాయి ఏరోబాటిక్స్ ప్రదర్శనతో, తేలికగా ఒదిగిపోయి, అత్యుత్తమ పనితనాన్ని ప్రదర్శిస్తుందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. 2019లో మలేషియా జరిగిన ఎయిర్ షోలోనూ తేజస్ యుద్ధ విమానాన్ని ప్రదర్శించారు. అయితే దుబాయ్ వేదికలో మాత్రం అందరి చూపు తేజస్ పైనే పడింది. ప్రస్తుతం సింగపూర్ లోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తే మరికొన్ని రోజుల్లోనే ఈ యుద్ధ విమనానికి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.

Also read: Fire Accident: ప్రాణాలకు తెగించి తల్లి కూతురిని రక్షించిన కానిస్టేబుల్