Covid Vaccine: శాస్త్రవేత్తల సిఫార్సు ఉంటేనే 5-15 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్: కేంద్ర మంత్రి

రానున్న రోజుల్లో 5-15 ఏళ్ల వయస్కులకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.

Covid Vaccine: శాస్త్రవేత్తల సిఫార్సు ఉంటేనే 5-15 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్: కేంద్ర మంత్రి

Minister

Covid Vaccine: దేశంలో కరోనా మహమ్మారిని అంతం చేసే దిశగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే 15 ఏళ్లు నిండిన వారందరు వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచనలు జారీచేయగా.. రానున్న రోజుల్లో 5-15 ఏళ్ల వయస్కులకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. గతేడాది జనవరి నుంచి ప్రారంభమైన వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా.. మొదటి ప్రాధాన్యంగా వైద్యసిబ్బంది, ఆరోగ్యకార్యకర్తలు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. అనంతరం 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Also read: Fire Accident: ప్రాణాలకు తెగించి తల్లి కూతురిని రక్షించిన కానిస్టేబుల్

2022 జనవరి నుంచి 15-18 ఏళ్ల వయసున్న వారికీ వ్యాక్సిన్ ఇవ్వొచ్చన్న శాస్త్రవేత్తల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే దశలు దాటుకుంటూ కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉండడంతో వ్యాక్సిన్ ప్రభావం పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏ వయస్కుల వారికీ ఏ విధంగా వ్యాక్సిన్ పనిచేస్తుందనే విషయంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉన్నందున 5-15 ఏళ్ల వయసున్న చిన్నారులకు సైతం వ్యాక్సిన్ అందేలా చూడాలని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 5-15 ఏళ్ల పిల్లలపై వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉందనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని.. వారి సిఫార్సుల మేరకే వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

Also read: Operation Parivartan : ఏపీలో గంజాయి నిర్మూలనకు ఆపరేషన్‌ పరివర్తన్‌.. దేశంలోనే మొదటిసారిగా 2లక్షల కేజీల గంజాయి ధ్వంసం

కేంద్రం వద్ద సరిపడా వ్యాక్సిన్లు ఉన్నాయని.. అయితే చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వొచ్చా లేదా అనే విషయంపై స్పష్టత రానందునా..ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని మాండవియా అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ తమ చేతుల్లో లేదని వైద్యాధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేసారు. ఇదిలా ఉంటే కరోనా మూడో దశ ఆరంభం నాటికే దేశంలోని 67 శాతం మంది చిన్నారుల్లో యాంటీ బాడీలు ఉత్పత్తి అయ్యాయని.. కరోనా సోకినా వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదని మాండవియా పేర్కొన్నారు.

Also read: Indian NCAP: ఇకపై భారత్ లో వాహనాలకు “స్వదేశీ భద్రతా ప్రమాణాలు”