Indian NCAP: ఇకపై భారత్ లో వాహనాలకు “స్వదేశీ భద్రతా ప్రమాణాలు”

సేఫ్టీ రేటింగ్" ఇచ్చే కార్యక్రమానికి భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటివరకు గ్లోబల్ NCAP, యూరోపియన్ NCAP, ఆసియాన్ NCAP వంటి సంఘాలే ఈ తరహా రేటింగ్ ను ఇస్తుండగా

Indian NCAP: ఇకపై భారత్ లో వాహనాలకు “స్వదేశీ భద్రతా ప్రమాణాలు”

Ncap

Indian NCAP: కార్లు, ఇతర వాహనాల్లో భద్రతా ప్రమాణాలను సూచిస్తూ.. “సేఫ్టీ రేటింగ్” ఇచ్చే కార్యక్రమానికి భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటివరకు గ్లోబల్ NCAP, యూరోపియన్ NCAP, ఆసియాన్ NCAP వంటి సంఘాలే ఈ తరహా రేటింగ్ ను ఇస్తుండగా.. ఇప్పుడు భారత్ లో వాహన భద్రతా ప్రమాణాలను మెరుగుపరచుకునే విధంగా పూర్తి స్వదేశీ అంశాలతో “భారత్ NCAP”ను తీసుకురానున్నట్లు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

Also read: Hijab Row: మా అంతర్గత వ్యవహారంలో మీరు తలదూర్చకండి: హిజాబ్ పై విదేశాంగశాఖ వివరణ

వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలను నివారిస్తూ..వాహనాల్లో ప్రయాణికుల భద్రతకు సంబంధించి..ప్రభుత్వం భద్రతా పరమైన సూచనలు చేస్తుంది. ఆ సూచనల మేరకు వాహన తయారీ సంస్థలు తమ వాహనాల్లో ఆయా భద్రత ప్రమాణాలను జోడించి మార్కెట్లోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈక్రమంలో వాహనాల్లోని భద్రతా ప్రమాణాలు ఏ తీరున పనిచేస్తున్నాయనే విషయాన్నీ పరీక్షించి.. సమయం, సందర్భం వంటి వివిధ అంశాలను పరిగణలోకి భద్రత రేటింగ్ ఇవ్వడమే NCAP సంఘాల ముఖ్యపని.

Also read: Cellphone Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఇకపై చట్టబద్ధం: నితిన్ గడ్కరీ

NCAP రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే వాహనం అంత సురక్షితమని అర్ధం. అందుకోసమే ప్రపంచంలోని వాహన తయారీ సంస్థలు ఈ NCAP రేటింగ్ పొందడం కోసం తీవ్రంగా కృషిచేస్తుంటాయి. అందుకోసం వాహనాల్లో నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా భద్రత వ్యవస్థను ఏర్పాటు చేస్తుంటారు కార్ల తయారీదారులు. అయితే ఇప్పటివరకు యూరోప్, గ్లోబల్, ఆసియాన్ దేశాలలోని రోడ్డు భద్రత ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకుని ఈ NCAP రేటింగ్ ఇస్తున్నాయి ఆయా సంఘాలు. అయితే ఇటీవల భారత్ లో రోడ్డు భద్రత ప్రమాణాలు మెరుగుపడ్డాయి. దీంతో పూర్తి స్వదేశీయ భద్రత ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకుని భారత్ NCAP రేటింగ్ సంస్థను ఏర్పాటు చేయనున్నారు.

Also read: Malaika Arora: 48 ఏళ్ల భామ.. ఇంకా హాట్ బ్యూటీనే!