Gold Smuggling: రూ.1473కోట్ల విలువైన 4,522 కేజీల బంగారాన్ని తరలించిన స్మగ్లర్ అరెస్ట్

అక్రమంగా బంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చి.. ఆపై హోల్ సేల్ మార్కెట్లో అమ్మకుంటూ సొమ్ము చేసుకుంటున్న స్మగ్లింగ్ ముఠా సభ్యుడిని ముంబై DRI పోలీసులు అరెస్ట్ చేశారు

Gold Smuggling: రూ.1473కోట్ల విలువైన 4,522 కేజీల బంగారాన్ని తరలించిన స్మగ్లర్ అరెస్ట్

Dri

Gold Smuggling: అక్రమంగా బంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చి.. ఆపై హోల్ సేల్ మార్కెట్లో అమ్మకుంటూ సొమ్ము చేసుకుంటున్న స్మగ్లింగ్ ముఠా సభ్యుడిని ముంబై DRI పోలీసులు అరెస్ట్ చేశారు. రయీస్ అహ్మద్ ఇక్కెరి అనే వ్యక్తి.. మరికొందరితో కలిసి 2017-2019 మధ్య రూ.1473కోట్ల విలువైన 4,522 కేజీల బంగారాన్ని దుబాయ్ నుంచి అక్రమంగా భారత్ లోకి రవాణా చేసినట్లు ముంబై డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు గుర్తించారు. “స్మగ్లింగ్ కింగ్ పిన్” అయిన నిసార్ అలియార్..షోబ్ జరోదర్‌వాలా అనే స్మగ్లర్ తో కలిసి గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ ఏర్పాటు చేశాడు. షోబ్ జరోదర్‌వాలాకు.. అహ్మద్ ఇక్కెరి దగ్గరి సన్నిహితుడు.

Also read: Ukraine Crisis: మరో నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ పై దాడి జరగబోతుంది: జో బైడెన్

దుబాయ్ నుంచి ముంద్రా పోర్టు మీదుగా.. రాగి కడ్డీల రూపంలో.. బంగారం దేశంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ముంబైలోని నిసార్ అలియార్ వద్దకు చేరుకున్న బంగారాన్ని షోబ్ జరోదర్‌వాలా హోల్ సేల్ మార్కెట్లో అమ్మేవాడు. అక్రమంగా బంగారాన్ని కొనుగోలు చేసే వ్యాపారస్తులకు.. జరోదర్‌వాలాకు మధ్య కోఆర్డినేటర్ గా పనిచేసే అహ్మద్ ఇక్కెరి ఒక్కో వ్యాపారికి వందల కేజీల బంగారాన్ని అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో షోబ్ జరోదర్‌వాలాను, నిసార్ అలియార్ ను పోలీసులు గతంలోనే అరెస్ట్ చేయగా..అహ్మద్ ఇక్కెరి తప్పించుకు తిరుగుతున్నాడు.

Also read: Buses for Sale: రూ.45 కేజీకి లగ్జరీ బస్సులను స్క్రాప్‌లో అమ్మకానికి పెట్టిన ట్రావెల్స్ యజమాని

ఇటీవల దుబాయ్ నుంచి బెంగుళూరు వచ్చిన అహ్మద్ ఇక్కెరిని అక్కడి DRI అధికారులు అడ్డుకోగా.. మాయమాటలు చెప్పి తప్పించుకున్నాడు. ఇక్కెరి పై ముంబై DRI అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీచేయగా..అధికారుల ఎదుట హాజరయ్యాడు. విచారణలో భాగంగా అహ్మద్ ఇక్కెరి చెప్పిన బంగారపు లెక్కలు విని అధికారులు నోరెళ్లబెట్టారు. మొత్తం 4,522 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలించి సొమ్ముచేసుకున్నట్లు ఇక్కెరి ఒప్పుకున్నాడు. అహ్మద్ ఇక్కెరికి ముంబై కోర్ట్ జ్యూడిసియల్ కస్టడీ విధించింది.

Also read: Tejas Aircraft: “సింగపూర్ ఎయిర్ షో-2022″లో తేజస్ యుద్ధ విమానాల ప్రదర్శన