North Korea : The Uncle సినిమా చూసినందుకు బాలుడికి 14 ఏళ్లు జైలుశిక్ష వేసిన ఉత్తర కొరియా ప్రభుత్వం

‘స్క్విడ్ గేమ్’ సిరీస్ చూసినవారికి దారుణశిక్ష విధించిన ఉత్తరకొరియా ప్రభుత్వం..మరో దాష్టీకానికి పాల్పడింది.‘ది అంకుల్’ సినిమాను చూస్తున్న బాలుడికి 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

14 Years In Jail For Watching The Uncle Movie In North Korean

North Korea : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసేవారికి దారుణ శిక్ష విధించింది ఉత్తరకొరియా ప్రభుత్వం. ఓ వ్యక్తిని సైన్యంతో అత్యంత కిరాతకంగా చంపించింది. ఏడుగురు విద్యార్ధులకు కఠిన శిక్ష విధించింది.ఆ ఏడుగురిలో ఒకరికి జీవిత ఖైదు శిక్ష విధించగా..మరో ఆరుగురికి ఐదేళ్ల నిర్భంద శిక్షను కిమ్ విధించారు. అంతేకాదు..సదరు విద్యార్ధులు చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్‌..టీచర్లను డ్యూటీల్లోంచి పీకిపారేశాడు. ఐదేళ్ల నిర్భంద శిక్ష విధించింది కిమ్‌ ప్రభుత్వం. పాపం వారంతా వారి తమ శిక్షాకాలం ముగిసేవరకు బొగ్గు గనుల్లో, మారుమూల పల్లెల్లో కూలీ పనులు చేసుకుని బతకాల్సిందే. మరే రకంగాను బతకటానికి వీల్లేదు.

ఈ క్రమంలో మరో దాష్టీకానికి పాల్పడింది కిమ్ ప్రభుత్వం. ‘ది అంకుల్’ అనే కొరియా సినిమాను దొంగచాటుగా చూస్తున్న ఓ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించాడని..అతనిపై నేరాన్ని మోపారు. ఈ కేసును విచారించిన కోర్టు ఆ బాలుడికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇటువంటి వింత వింత శిక్షలు ఉత్తర కొరియా ప్రభుత్వంలో సర్వసాధారణం. పొరుగు దేశం దక్షిణ కొరియా విషయంలో ఉత్తర కొరియా ప్రభుత్వం అత్యంత కఠినంగా ఉంటుంది. అటువంటిది దక్షిణ కొరియాకు సంబంధించిన ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూస్తే ఊరుకుంటుందా?అందుకే ఆ సిరిస్ చూడవద్దని..చూస్తే కఠిన శిక్షలు తప్పవని కిమ్ ప్రభుత్వం రూల్ పాస్ చేసింది.

ఈక్రమంలో దొంగచాటుగా ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి కఠిన శిక్షలు విధించిన కిమ్ ప్రభుత్వం..తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ‘ది అంకుల్’ సినిమా చూసిన ఓ బాలుడికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించి దటీజ్ కిమ్ ప్రభుత్వం స్టైల్ అని మరోసారి నిరూపించింది.

Read more : Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

హైసన్ సిటీకి చెందిన ఓ బాలుడు ‘ది అంకుల్’ అనే దక్షిణ కొరియా సినిమాను చూడటానికి అన్నీ రెడీ చేసుకున్నాడు. డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఆ సినిమా ప్లే చేసి.. 5 నిమిషాలు చూశాడో లేదో.. వెంటనే పోలీసులకు ఆ విషయం తెలిసిపోయింది. ఆఘమేఘాలమీద వచ్చి పాపం ఆ బాలుడిని ఏదో ఘోరాతి ఘోరం చేసినట్లుగా అరెస్ట్ చేసి తీసుకుపోయారు.ఆ సినిమా వీడియోను కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా నేరాలు మోపి కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించి కోర్టు అతనికి 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆ బాలుడు 14 ఏళ్లు జైలులోనే గడపాలి. కూలి పనులు చేయాలి.

కాగా..ఇటువంటి శిక్షలు ఉత్తర కొరియాలో సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రభుత్వం ఏదన్నా రూల్ పాస్ చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలు పాటించి తీరాల్సిందే. లేదంటే తప్పవు కఠిన శిక్షలు. అంతెందుకు..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ వంశీకుల ఫోటోలు దేశంలో ప్రతి ఇంటిలోను ఉంటాయి. వారిని ప్రజలు ఎంతో గౌరవంగా చూసుకోవాలి. ప్రమాదవశాత్తు ఏ ఇంటిలోనైనా అగ్నిప్రమాదం జరిగితే వారి ఇంటిలో ఎవరు చనిపోయినా ఫరవాలేదు. మంటల్లో కాలిపోయినా ఫరవాలేదు. కానీ ఆ ఇంటిలో ఉన్న కిమ్ వంశీకుల ఫోటోలకు ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు.

Read more : fire accident in delhi parliament : పార్లమెంట్‌లో అగ్ని ప్రమాదం

అలా ఓ ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ ఇంటి మహిళ తన పిల్లల్ని తన ప్రాణాలకు తెగించి కాపాడుకుంది. కానీ అధ్యక్షుడు కిమ్ వారి వంశీకుల ఫోటోలను మంటలనుంచి బయటకు తేలేకపోయింది. ఆ ఫోటోలు మంటల్లో కాలిపోయాయి. అదే ఆమె పాలిట శాపమైంది. ఆమెను అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించారు. ఇటువంటి ఘటనలు ఎన్నో ఎన్నెన్నో ఉత్తర కొరియాలో కిమ్ పాలనలో.

పిల్లల్ని కాపాడుకోవటం ఆ తల్లి చేసిన నేరమా?
ఉత్తర కొరియాలోని నార్త్ హామ్‌గ్యాంగ్‌ ప్రావిన్స్‌లోని ఒన్సోంగ్ కౌంటీలో ఒక ఇంటిలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. దీంతో తల్లి తన ప్రాణాలు పణ్ణంగా పెట్టి పిల్లల్ని కాపాడుకుంది. కానీ అప్పటికే మంటలు తీవ్రంగా వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్థమయింది. అయితే ఆ మంటల్లో ఆ దేశ మాజీ నాయకులైన కిమ్‌ ఇల్ సంగ్, కిమ్‌ జోంగ్ ఇల్ ఫొటోలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో దేశ నాయకుల ఫొటోలను మంటల నుంచి కాపాడలేకపోయినందుకు ఆమెపై పోలీసులు నేరం మోపారు. విచారణ చేపట్టారు. ఆతరువాత ఆమెకు 15 ఏళ్లపాటు జైలు శిక్ష విధించినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని ప్రభుత్వం బయటకు రానివ్వలేదు.

ఉత్తర కొరియా చట్టాల ప్రకారం కిమ్‌ కుటుంబంలో చనిపోయిన నాయకులను బతిన వారిగా భావిస్తూ వారి ఫొటోలను ఆ దేశంలో ప్రతి పౌరుడూ తమ ఇళ్లలో ఉంచుకోవాలి. వారి ఫోటోల కంటే పైన మరే ఇతర ఫొటోలు ఉండకూడదు. ఎప్పుడూ ఫోటోలను నీట్ గా ఉంచాలి. దుమ్ము ధూళి పడకూడదు. ఒక వేళ ఫొటోలను గౌరవించడం, భద్రపరచే విషయంలో లోపాలు జరిగితే శిక్షలు కఠినంగా ఉంటాయి.
ఈ ఫొటోలను పరిశీలించేందుకు అప్పుడప్పుడు పోలీసులు తనీఖీలు నిర్వహిస్తుంటారు. అగ్నిప్రమాదాలు, వరదల వంటివి సంభవించినప్పుడు ఫొటోలను కాపాడుతూ ఎవరైనా పౌరులు చనిపోతే వారిని హీరోలుగా కీర్తిస్తారు. అయితే విచారణ జరుగుతున్నందున ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను చూసేందుకు కూడా పోలీసులు వారి తల్లిని అనుమతించలేదు.