fire accident in delhi parliament : పార్లమెంట్‌లో అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 8 గంటల సమయంలో పార్లమెంట్ భవనంలోని 59వ నెంబర్ గదిలో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు

fire accident in delhi parliament : పార్లమెంట్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident In Delhi Parliament Building

fire accident in delhi parliament building :ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం (డిసెంబర్ 1,2021) ఉదయం 8 గంటల సమయంలో పార్లమెంట్ భవనంలోని 59వ నెంబర్ గదిలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది  వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం స్వల్పంగానే జరగటంతో 10 నిమిషాల్లోనే మంటలు అదుపులోకి వచ్చామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో కొన్ని కూర్చీలు, టెబుల్స్, కంప్యూటర్‌లు, ఫర్నీచర్ కాలిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదగ..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌లో భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. సమావేశాలు ప్రారంభానికి ముందే ఉదయం పూట ఈ ప్రమాదం జరిగింది. కాగా నవంబర్ 29 నుంచి ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 23 వరకు సాగనున్నాయి.