Yellamma : ఎల్లమ్మలో హీరోయిన్గా మమిత బైజు!
దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కుతోన్న ఎలమ్మ (Yellamma ) మూవీకి సంబంధించి హీరోయిన్ ఎవరు అనే దానిపై మేకర్స్ చాలాకాలంగా చర్చలు జరుపుతున్నారు
Gossip Garage Mamitha Baiju is fix in Yellamma movie
Yellamma : దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కుతోన్న ఎలమ్మ మూవీకి సంబంధించి హీరోయిన్ ఎవరు అనే దానిపై మేకర్స్ చాలాకాలంగా చర్చలు జరుపుతున్నారు. ముందు సాయిపల్లవి ఆ తర్వాత కీర్తి సురేష్ మధ్యలో మృణాల్ ఠాకూర్ ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడు మమితా బైజు పేరు దాదాపు ఫైనల్ అయినట్లే అనే డిస్కషన్ నడుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌తో దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తుండగా ఆయన పక్కన కొత్త ఫేస్ కోసం చూస్తున్నారట. దీనికోసం మమిత పేరును ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఫ్రెష్ జోడీగా మంచి బజ్ క్రియేట్ అవుతుందనేది మేకర్ ఒపీనియన్
Kevvu Kartheek : భార్య సీమంతం వేడుకలు.. ఫొటోలు షేర్ చేసిన జబర్దస్త్ కెవ్వు కార్తీక్..
ప్రేమలు, డ్యూడ్‌లాంటి సినిమాలతో మమిత తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. ధనుష్ హీరోగా వచ్చిన కర మూవీలో కనిపించింది మమిత. సెల్లి అనే మిడిల్‌క్లాస్ అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది. కర మూవీతో మమితకు మంచి గుర్తింపు రాగా.. పెద్ద బ్యానర్ల అటెన్షన్ డ్రా చేసింది. అదే ఎల్లమ్మలో చాన్స్ దక్కేలా చేసిందని, డీఎస్పీ పక్కన మమిత దాదాపు ఫైనల్ అయినట్లే అనే గాసిప్స్ జోరుగా వినిపిస్తున్నాయి.
