Nostradamus's Predictions for 2025
Nostradamus 2025 Predictions : మరికొద్ది రోజుల్లో 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది తమకు మంచి జరగాలని అందరూ కోరుకుంటారు. అదే సమయంలో, 16వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త దర్శకుడు, ప్రసిద్ధ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ (2025 అంచనాలు) భయాందోళన కలిగిస్తున్నాయి. నోస్ట్రాడమస్ 2025 అంచనాలను నమ్మితే.. రాబోయే సంవత్సరం మొత్తం ప్రపంచానికి పెనుముప్పు తప్పదని చెప్పవచ్చు.
నోస్ట్రాడమస్ 1555 సంవత్సరంలో ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో ఆయన కొన్ని ప్రిడెక్షన్లు చెప్పాడు. తన పుస్తకంలో 2025 సంవత్సరానికి సంబంధించి కొన్ని అంచనాలు కూడా ప్రస్తావించాడు. నోస్ట్రాడమస్ అని పిలిచే మిచెల్ డి నోస్ట్రేడామ్.. ప్రవచనాలకు ప్రసిద్ధి చెందాడు. మనం 2025 ఏడాదికి సంబంధించిన కొన్ని సూచనలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ అంచనాలు నిజమవుతాయా? :
నోస్ట్రాడమస్ 2025 నాటికి రష్యా, ఉక్రెయిన్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణకు ఈ ఏడాది ముగింపు పడుతుందని అంచనా వేశారు. యుద్ధం వల్ల ఆర్థిక సమస్యలు, వనరులు తగ్గిపోతున్నందున యుద్ధం ముగిసిపోతుందని అన్నారు.
ఇంగ్లాండ్ యుద్ధం, మహహ్మారి ప్లేగును మళ్లీ ఎదుర్కొంటుంది. కొత్త కరెన్సీ వస్తుంది. ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టనుంది. ప్రపంచ రాజకీయాలు మారుతాయి. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అంచనా ఎంతవరకు నిజమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
2025 ఇంగ్లండ్‌కు యుద్ధం తప్పదా? :
నోస్ట్రాడమస్ 2025లో ఇంగ్లండ్ గురించి భయానకమైన అంచనా వేసాడు. ఆయన ప్రకారం ఇంగ్లాండ్ యుద్ధాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే, ఒక ఘోరమైన ప్లేగు అంటువ్యాధి కూడా ప్రబలవచ్చు. దాంతో పాటు, రాజకుటుంబంలో అంతర్గత విభేదాలను ప్రస్తావించారు.
ఇలాంటి పరిస్థితిలో, రాబోయే సంవత్సరంలో ఈ అంచనాలు నిజమవుతాయా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది. 2025 సంవత్సరానికి సంబంధించి నోస్ట్రాడమస్ 10 భయాన సంఘటనలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..
1. ఇంగ్లండ్‌లో క్రూరమైన యుద్ధాలు “పురాతన ప్లేగు” మళ్లీ విజృంభించే ప్రమాదం ఉంది. ఆయన అంచనా ప్రకారం.. ఏ శత్రువు కన్నా వినాశకరమైనది.
2. 2025లో ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొంటుందని లేదా ప్రమాదకరంగా దగ్గరగా వచ్చి మానవాళికి ప్రమాదం కలిగిస్తుందని నోస్ట్రాడమస్ అంచనా.
3. ప్రపంచ రాజకీయాల్లో గణనీయమైన మార్పు జరుగుతుంది. స్థాపించిన పాశ్చాత్య దేశాల ప్రభావంలో తగ్గుదల, కొత్త ప్రపంచ శక్తుల ఆవిర్భావం ఈ మార్పును కలిగి ఉంటుంది.
4. ప్రపంచవ్యాప్తంగా హరికేన్లు, సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. భౌగోళిక అస్థిరత, సౌర కార్యకలాపాలు, వాతావరణ మార్పుల సంగమం ఈ విపత్తులకు దారి తీస్తుంది.
5. బంగారం లేదా వెండికి బదులుగా “కాయిన్ లెదర్” విలువ ఎక్కువగా పెరుగుతుంది. దీని కారణంగా ఆర్థిక అస్థిరత, ఆర్థిక విపత్తు లేదా కరెన్సీ విలువలో పెనుమార్పును సూచిస్తాయి.
6. నోస్ట్రాడమస్ ప్రకారం.. 21వ శతాబ్దం వైద్య సాంకేతికతలో గణనీయమైన అభివృద్ధిని చూస్తుంది. అనారోగ్యం నివారణ, చికిత్సలో గణనీయమైన మెరుగుదల కనిపించనుంది.
7. కొత్త ప్రపంచ కరెన్సీ కనిపిస్తుంది. ఇది సాంప్రదాయ జాతీయ కరెన్సీల నిష్క్రమణను సూచిస్తుంది. ప్రపంచ వాణిజ్యం, వ్యాపారానికి మద్దతుగా ఈ కొత్త కరెన్సీ చక్రం తిప్పనుంది.
8. నోస్ట్రాడమస్ ప్రకారం.. అంతరిక్ష సాంకేతికతలో గణనీయమైన పురోగతి, కొత్త గ్రహాలు, ఖగోళ వస్తువుల ఆవిష్కరణగా ఈ కాలాన్ని వర్ణించవచ్చు.
9. గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీ సైబర్ అటాక్ జరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్యం, కమ్యూనికేషన్, భద్రతపై ఈ సైబర్ దాడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
10. ఆయన రచనల ప్రకారం.. వినాశకరమైన వరదల మధ్య ఒక సామ్రాజ్యం ఉద్భవించి. అదే “జల సామ్రాజ్యం”. వాతావరణ సంబంధిత విపత్తుల ఫలితంగా ఒక కొత్త శక్తి ఆవిర్భావంగా పరిగణించవచ్చు.
2025 సంవత్సరానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నోస్ట్రాడమస్ అంచనాలను పేర్కొన్నారు. ఈ అంచనాలు నిజమవుతాయో లేదో కాలమే చెబుతుంది. ఆయన ఊహించినవన్నీ నిజమవుతాయని చెప్పలేమని అంటున్నారు.