General Sherman tree : 2,300 ఏళ్ల వయస్సున్న భారీ వృక్షానికి అల్యూమినియం కవర్

ప్రపంచంలోనే అత్యంత మహా వృక్షాన్ని కాపాడటానికి అధికారులు ఆఘమేఘాలమీద చర్యలు తీసుకుంటున్నారు. ఆ మహా వృక్షానికి రక్షణ రేకును తొడిగి కాపాడటానికి యత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే..

2300 years old General Sherman tree : చిన్న విత్తనం నుంచి ఆవిర్భవించిన మొలక వృక్షంగా మారటానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. అదే మహా వృక్షం కావటానికి వందల ఏళ్లు పడుతుంది. కొన్ని అరుదైన వృక్షాలు వందల ఏళ్లే కాదు వేల సంవత్సరాలు కూడా జీవిస్తాయి. అటువంటి చెట్లలో ఓ అరుదైన చెట్టు కాదు కాదు మహా వృక్షం ‘జనరల్ షర్మన్’. కాలిఫోర్నియాలోని అటవీ ప్రాంతంలో ఉండే ఈ మహా వృక్షం వయస్సు 2,000 ఏళ్లకు పైగానే. 2300 నుంచి 2700 ఏళ్ల వయస్సు ఉంటుందని ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మహా వృక్షాన్ని కాపాడటానికి అధికారులు ఆగమేఘాల మీద చర్యలు చేపట్టారు.

Read more: చెట్టుని పెళ్లి చేసుకున్న మహిళ.. ఘనంగా వెడ్డింగ్ డే సెలబ్రేషన్

ఎందుకంత ఆఘమేఘాలమీద చర్యలు తీసుకోవటం అంటే..కాలిఫోర్నియాలోని అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక చెట్టు అయిన ఈ జనరల్ షర్మన్ అనే చెట్టును కాపాడటానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కాలిఫోర్నియాలోని సీకోయా జాతీయ ఉద్యానవనంలో ఉన్న జనరల్ షర్మన్ అనే చెట్టు ప్రపంచంలోనే అతి పెద్దదిగా పేరొందింది. ఆ వృక్షాన్ని కాపాడేందుకు మంటలు తట్టుకుని చెట్టుకు ఎటువంటి హాని కలుగకుండా ఉండేందుకు అధికారులు అల్యూమినియం పొరను దాని చుట్టూ కప్పుతున్నారు. సుమారు 275 అడుగుల ఎత్తులో ఉండి 52,508 క్యూబిక్ ఫీట్ల విస్తీర్ణంలో ఆవరించి ఉంది ఈ ‘జనరల్ షర్మన్’ మహా వృక్షం.ఈ వృక్షం దట్టమైన అడవిలో 2,200 సీకోయా చెట్ల మధ్య విస్తరించి ఉంది.

Read more : చెట్లు నరికినందుకు రూ. 53వేలు జరిమానా

ఈ జనరల్ షర్మన్ వృక్షానికి మంటలు అంటుకునే అవకాశం ఉండటంతో దాని చుట్టూ అల్యూమినియం పొరను కప్పుతున్నామని పార్కు అధికారులు తెలిపారు. ఈ అల్యూమినియం పొర తీవ్రమైన అగ్నిని కూడా తట్టుకుంటుందని వారు చెబుతున్నారు. ‘‘వాతావరణ మార్పులు తీవ్రంగా ఉండటంతో వడగాలులు వీస్తున్నాయి. ఫలితంగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి’అని సీకోయా జాతీయ ఉద్యానవన విపత్తు కార్యనిర్వహణాధికారి తెలిపారు. అందువల్ల భారీ వృక్షాలను కాపాడటానికి ఇటువంటి చర్యలు చేపట్టాల్సి వస్తుందని వివరించారు.

 

ట్రెండింగ్ వార్తలు