పిజ్జా కావాలంటూ పోలీసులకు ఫోన్..ఓకే.. బేబీ అంటూ ప్రశంసలు

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 06:34 AM IST
పిజ్జా కావాలంటూ పోలీసులకు ఫోన్..ఓకే.. బేబీ అంటూ ప్రశంసలు

Updated On : November 26, 2019 / 6:34 AM IST

అమెరికాలోని ఒహియోలోని ఒరెగాన్ లో ఓ మహిళ పోలీస్ డిపార్ట్ మెంట్ లోని ఎమర్జీన్సీ నంబర్ 911కు కాల్ చేసి.. ’’నాకు అర్జెంట్ గా ఓ పిజ్జా కావాలని’’ చెప్పింది. అదేంటీ పిజ్జా కావాలంటే పిజ్జా హౌస్ కు కాల్ చేస్తారు కానీ..పోలీసులకు ఫోన్ చేయటమేంటని ఆశ్చర్యపోవచ్చు. కానీ అక్కడే ఉంది అసలు కిటుకు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన టిమ్ టెనేక్ అనే  పోలీస్ ఆఫీసర్ కూడా అనుకుంది. ఇది ఎమర్జీన్సీలో డిపార్ట్ మెంట్. ఆపదల్లో ఉన్నవారి కోసం ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్. పిజ్జా డెలీవరీ సెంటర్ కాదు అంటూ కోపంగా ఫోన్ కట్ చేయబోయింది. కానీ ఫోన్ చేసిన సదరు యువతి ఆ మాటల్ని పట్టించుకోలేదు. మరోసారి ‘‘నేను చెప్పింది మీకు అర్థం కావటంలేదు..నాకు అర్జంట్ గా ఓ పిజ్జా కావాలి..అర్థమవుతోందా?’ అంటూ మళ్లీ చెప్పింది. దీంతో టిమ్ ఆలోచించింది. 

ఆమె గొంతులోని ఆతృత, భయం టిమ్‌కు అర్థమైంది. అంతే..మరోసారి అడ్రస్ అడిగింది. పిజ్జా ఎంతమందికి కావాలి? ఎంతమంది ఉన్నారు? అని అడిగింది. ఫోన్ చేసిన యువతిని, ఆమె తల్లిని ఓ వ్యక్తి హింసిస్తున్నాడని టిమ్ అర్థంచేసుకుంది. వెంటనే పిజ్జా పంపిస్తానంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది. అనంతరం  కాసేపటికే పోలీసులు ఫోన్ చేసిన అమ్మాయి అడ్రస్‌కు వెళ్లారు. ఆమెను, ఆమె తల్లిని రక్షించారు. ఆపదలో ఉన్న సమయంలో ఏమాత్రం బెదిరిపోకుండా..ఆమె చూపిన తెలివితేటలకు పోలీసులు ఆమెను అభినందించారు. ఇటువంటి ఘటనే జరిగినట్లుగా సోషల్ మీడియాలో తెలుసుకున్నాననీ..అందుకే ఆ ఫోన్‌ను అర్థం చేసుకోగలిగానని టిమ్ చెప్పింది. 

కోడెడ్ కాల్స్ చేసినవారి పేర్లు వివరాలు పోలీసులు చెప్పరు. అందుకే ఫోన్ చేసిన బాధితుల పేర్లు పోలీసులు చెప్పలేదు. కాగా..సదరు తల్లీ కూతుర్లను హింసించిన సైమన్ లోపెజ్‌ను అరెస్టు చేసామని ఒరెగాన్ పోలీస్ చీఫ్ మైఖేల్ నవారే శనివారం (నవంబర్ 23)తెలిపారు.