శ్రీలంక పేలుళ్లలో మహిళా సూసైడ్ బాంబర్ 

శ్రీలంకలో బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి రువాన్‌ విజయవర్దనే తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 07:17 AM IST
శ్రీలంక పేలుళ్లలో మహిళా సూసైడ్ బాంబర్ 

Updated On : April 24, 2019 / 7:17 AM IST

శ్రీలంకలో బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి రువాన్‌ విజయవర్దనే తెలిపారు.

కొలంబో: శ్రీలంకలో బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి రువాన్‌ విజయవర్దనే తెలిపారు. ఏప్రిల్ 21న ఈస్టర్‌ వేడుకల సందర్భంగా శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో పలు బాంబు పేలుళ్లు సంభవించాయి. మూడు చర్చిలు..మూడు హోటల్స్ లో మొత్తం ఆరు బాంబులు పేలాయి. అతి కొద్ది సమయం వ్యవధిలోనే పేలిన ఈ వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 359 మంది మృతిచెందారని వారిలో 39మంది విదేశీయులు ఉన్నారని శ్రీలంక ప్రభుత్వం విడదుల చేసిన ప్రకటనలో వెల్లడించింది. 500లకు పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. కాగా రోజు రోజుకు  మృతులు సంఖ్య పెరుగుతున్నారు. 
Also Read : లంకలో నరమేథం : 359కి చేరిన మృతులు

కాగా గత నాలుగు రోజులుగా పేలుతున్న క్రమంలో నాలుగవ రోజున కూడా సోవోయ్ సినిమాస్ వద్ద ఈ పేలుడు సంభవించింది.  ఈ ఘటనలో ప్రాణ నష్టం మాత్రం కలగలేదు. కాగా దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన ఐసిస్ ఉగ్రవాదు పన్నాగాలను గుర్తించేందుకు పోలీసులు, ఆర్మీ ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా ఇప్పటికే తొమ్మిది బాంబులను భద్రతాదళాలు నిర్వీర్యం చేసారు. కాగా ఈ పేలుళ్లు సంభవించిన నాటి నుంచి ప్రభుత్వం ఐసీసీ సానుభూతిపరులుగా  అనుమానించిన  120మందిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది. 
Also Read : నాలుగవ రోజు : శ్రీలంకలో మరో బాంబు పేలుడు