అక్కడ నిర్వహించిన బుక్‌ ఫెయిర్‌లో కేవలం 35 పుస్తకాలే అమ్ముడుపోయిన వైనం.. బిర్యానీకి మాత్రం మస్తు గిరాకీ

బుక్‌ ఫెయిర్‌కి హాజరైనవారు మొత్తం 1,200 షావర్మాలు, 800 ప్లేట్ల బిర్యానీలను కొనుగోలు చేశారు.

అక్కడ నిర్వహించిన బుక్‌ ఫెయిర్‌లో కేవలం 35 పుస్తకాలే అమ్ముడుపోయిన వైనం.. బిర్యానీకి మాత్రం మస్తు గిరాకీ

Updated On : October 23, 2024 / 3:42 PM IST

బుక్‌ ఫెయిర్‌ అంటే పుస్తక ప్రియులు ఎగబడి మరీ పుస్తకాలు కొనుక్కుని వెళ్తుంటారు. లక్షలాది పుస్తకాలు అమ్ముడవుతుంటాయి. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో మాత్రం కేవలం 35 పుస్తకాలు మాత్రమే అమ్ముడు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అదే బుక్ ఫెయిర్‌లో బిర్యానీలు, షవర్మాలు మాత్రం భారీగా అమ్ముడుపోయాయి. బుక్‌ ఫెయిర్‌కి హాజరైనవారు మొత్తం 1,200 షావర్మాలు, 800 ప్లేట్ల బిర్యానీలను కొనుగోలు చేశారు. బుక్‌ ఫెయిర్‌కి పుస్తకాలను కొనడానికి కాకుండా బిర్యానీ తినడానికే వాళ్లు వెళ్లినట్లున్నారని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

పుస్తక ప్రదర్శన సాహిత్యం, సంస్కృతిని ప్రోత్సహించడానికి నిర్వహిస్తే, చివరకు అది బిర్యానీని ప్రోత్సహించడానికి నిర్వహించినట్లు అయిందని అంటున్నారు. అసలు పాకిస్థాన్‌ వాళ్లకు తిండే మీదే ధ్యాసగానీ పుస్తకాలు చదవడం మీద లేదా? అని నెటిజన్లు అడుగుతున్నారు.

లాహోర్‌ను సంస్కృతి, సాహిత్యాల కేంద్రం అని అంటుంటారు. పుస్తకాలకు ఖర్చు చేయని పాకిస్థానీలు ఇలా బిర్యానీలకు అంతగా ఖర్చుపెడుతున్నారని, అందుకే ఆ దేశం అన్ని రంగాల్లోనూ వెనకబడిపోతోందని కొందరు కామెంట్లు చేశారు.

Fake Court: ఒరే బాబులు ఏందిరా ఇది.. ఐదేళ్లుగా ఇంత మోసమా..!