ముస్లిం దేశం కరెన్సీ నోటుపై గణేష్ బొమ్మ

విఘ్నాలను తొలగించే వినాయకుడి ఉత్సవాలను భారత దేశం అంగరంగ వైభోగంగా జరుపుకుంటోంది. గణనాథుడుని భారత్ లో కాదు ప్రపంచంలో పలు దేశాల్లో పూజిస్తున్నారు. వాటిలో ముస్లిం దేశాలు కూడా ఉండటం విశేషం. ఏకదంతుడి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ఓ ముస్లిం దేశం బొజ్జగణపయ్యకు ఇచ్చిన అరుదైన..అద్భుతమైన గౌరవం గురించి తెలుసుకుందాం..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు వారి కరెన్సీ నోట్లపై ఆ దేశానికి చెందిన గొప్ప వ్యక్తుల ఫోటోలను ముద్రిస్తుంటారు. అది వారికి ఇచ్చే అరుదైన గౌరవం. అటువంటి గౌరవరం హిందూ దేవుడైన గణేషుడికి దక్కింది. ఇండోనేషియా కరెన్సీ నోటుపై వినాయకుడి బొమ్మను ముద్రించారు. గణేష్ వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఈ విషయాన్ని బాలీవుడ్ డైరెక్టర్ తనుజ్ గార్గ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ప్రపంచంలో వినాయకుడి చిత్రాన్ని కరెన్సీ నోటుపై ముద్రించిన ఏకైక ముస్లిం దేశం.. ఇండోనేషియా అంటూ తనుజ్ గార్గియా ట్వీట్ చేశారు. ఇండోనేషియా కరెన్సీ 20వేల రుపయా నోటులో ఇండోనేషియా స్వాతంత్ర్య సమరయోధుడు ‘కి హజార్ దేవంతరా’ చిత్రానికి పక్కనే వినాయకుడి చిత్రాన్ని ముద్రించారు.ఈ విషయం చాలా మందికి తెలియదు. గార్గ్ చేసిన ఈ ట్వీట్ ద్వారా అందరికీ ఈ విషయం తెలిసింది.
Did you know? #WednesdayWisdom #Indonesia #Ganesha pic.twitter.com/xjNB69TCn1
— TANUJ GARG (@tanuj_garg) September 4, 2019