Naked Forest: నగ్నంగా ఉంటేనే అడవిలోకి ఎంట్రీ.. ఆడాళ్లకు మాత్రమే

ఇండోనేషియాలో పపువా ప్రాంతంలో ఉన్న అడవిలోకి వెళ్లాల్సిందే నగ్నంగా ఉంటేనే కుదురుతుందట. ఎవరైనా మగాళ్లు హద్దులు దాటి అడవిలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే..

Naked Forest: నగ్నంగా ఉంటేనే అడవిలోకి ఎంట్రీ.. ఆడాళ్లకు మాత్రమే

Naked Forest

Updated On : June 29, 2021 / 9:27 PM IST

Naked Forest: ఇండోనేషియాలో పపువా ప్రాంతంలో ఉన్న అడవిలోకి వెళ్లాల్సిందే నగ్నంగా ఉంటేనే కుదురుతుందట. ఎవరైనా మగాళ్లు హద్దులు దాటి అడవిలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే.. 69డాలర్ల జరిమానా చెల్లించాల్సిందే. బీబీసీలో ఇటీవల అడవి గురించి ఓ కథనం పబ్లిష్ అయింది. కేవలం మహిళలు మాత్రమే అడవిలోకి వెళ్లి అక్కడి సంగతులను తెలుసుకునేందుకు ప్రయత్నంచారు

అక్కడే ఉన్న ఆడ్రియానా మెరౌడ్ అనే మహిళ.. అడవిలోకి రావాలంటే నగ్నంగా ఉంటేనే ఎంట్రీ ఇస్తారు. ఇలా బట్టలతో ఉంటే రానివ్వమని ఆరంభంలోనే అడ్డుకుంటుందట. ఈ సంప్రదాయాన్ని తాము తరతరాలుగా పాటిస్తున్నామని.. ఎవరైనా మగాళ్లు లోనికి వచ్చేందుకు ప్రయత్నిస్తే.. శిక్షతో పాటు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుందని అది కూడా పాలిష్ చేసిన రాళ్ల లాంటివి సమర్పించుకోవాలని చెప్పింది.

మరో గ్రామస్థురాలైన అతి రుమబోరుసీ బోర్ కొడితే స్నేహితులు, కుటుంబంతో కలిసి టూర్ కు వెళ్తామని చెప్పింది. చుట్టూ మగాళ్లు లేకపోవడం మాకు స్వేచ్ఛగా ఉంటుంది. మా పెద్ద వాళ్లతో కలిసి ఓపెన్ గా మా భావాలను పంచుకుంటాం. బురదలో తిరుగుతాం. ఆల్చిప్పలు సేకరిస్తాం.

ఇది మాకు చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇది లేకుండా మేం ఉండలేం. ప్రతి రోజూ ఇక్కడకు వచ్చి ఆల్చిప్పలు సేకరిస్తాం. ఇక్కడ మహిళలు ఒకర్ని ఒకరు బాగా నమ్ముతారు. సీక్రెట్లు, ప్రైవేట్ మ్యాటర్స్ కూడా పంచుకుంటారు. దీన్ని ఇలా వదిలేయం.

ఈ ఆల్చిప్పలన్నింటినీ దగ్గర్లోని మార్కెట్లలో అమ్ముకుంటాం. ఈ అడవి మహిళల కోసమే కేటాయించారు. ఇక్కడి నీరు కలుషితమైపోతుందని.. మార్కెట్ నుంచి వచ్చే వ్యర్థాలన్నీ ఇందులో చేరిపోతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు.