Pakistan former minister Fawad Chaudhry
Pakistan former minister Fawad Chaudhry : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ మాజీ ప్రధాని అనుచరుడు, మాజీ మంత్రి కోర్టు ఆవరణలో పోలీసులను చూసి కోర్టులోపలికి పరుగెత్తిన ఆసక్తికర ఘటన మంగళవారం (మే 16,2023) చోటుచేసుకుంది. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారనే ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకుడు మాజీ సమాచార శాఖా మంత్రి ఫవాద్ చౌదరి భయంతో మాజీ మంత్రి పరుగులు పెట్టిన సీన్ ఆసక్తికరంగా మారింది.
భూమి కబ్జా కేసులో కొన్ని రోజుల క్రితం ఖాన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో నాటకీయ రీతిలో అరెస్టు చేయటంతో దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనతో పాక్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్ అరెస్ట్ తరువాత పాకిస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. పారామిలిటరీ రేంజర్ల అదుపులో ఉన్న ఇమ్రాన్‌ను వెంటనే విడుదల చేయాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఆ మరుసటి రోజే ఆయనకు బెయిల్ లభించింది.
Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 2 వారాల బెయిల్
ఇదిలా ఉంటే మంగళవారం అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి మాజీ మంత్రి ఫవాద్ కోర్టులోకి పరుగు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన క్రమంలో పీటీఐ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంట్లో భాగంగా ఆందోళనల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఫవాద్ చౌదరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన తన అరెస్ట్ పై హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అతనిని కోర్టు ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆయన కోర్టు నుండి బయటకు వచ్చి తన కారు ఎక్కి వెళ్తుండగా అదే సమయంలో పోలీసులు ఆయన కారును అడ్డుకుని మరో కేసులో అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో పాపం మాజీ మంత్రికి అరెస్ట్ భయం వేసింది.అంతే ఒక్కసారిగా కారులోంచి దిగి కోర్టులోపలికి ఫాస్టుగా పరుగెత్తుకుంటువెళ్లిపోయారు. దీన్ని అక్కడున్న కొంతమంది వీడియో తీశారు.
తనకు కోర్టు బెయిల్ ఇచ్చిందని అయినా తనను మరోసారి అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన కోర్టకు మొరపెట్టుకున్నారు. దీనిపై వెంటనే స్పందించిన న్యాయమూర్తి మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. ఆయన పరుగెత్తుతున్న సమయంలో కోర్టు ప్రాంగణంలో కిందపడిపోయారు. దీంతో అక్కడే ఉన్న కొంతమంది న్యాయవాదులు స్పందించి ఆయనను లేపి లోపలకు తీసుకెళ్లారు.